నరసరావుపేటలో...
జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేసిన జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు గోపిరెడ్డి అన్ని నియోజకవర్గాల్లో అన్నదానాలు, సేవా కార్యక్రమాలు
చిలకలూరిపేటలో...
చిలకలూరిపేటలో వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న
మాజీ మంత్రి విడదల రజిని, పార్టీ నాయకులు
క్రోసూరులోని పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేస్తున్న
మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, యెనుముల, పార్టీ నాయకులు
పిడుగురాళ్లలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి
రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త శక్తి మేర కృషి చేయాలని పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గురువారం స్థానిక లింగంగుంట్లలోని జిల్లా పార్టీ కార్యాలయంలో వందలాదిమంది నాయకులు, కార్యకర్తల నడుమ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి వైఎస్సార్ ప్రతిమకు పూలు చల్లి నివాళులర్పించారు. కార్యకర్తలు ఏర్పాటుచేసిన 16 కేజీల భారీ కేకును కట్‌చేసి ఆనందోత్సవాల మధ్య పంపిణీ చేశారు.
సాక్షి, నరసరావుపేట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్బావ వేడుకలను పల్నాడు జిల్లా వ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు. అన్ని గ్రామాలు, పట్టణాలలోని పార్టీ కార్యాలయాలు, వైఎస్సార్ విగ్రహాల వద్ద సంబరాలు జరుపుకున్నారు. ప్రజాప్రతినిధులు, నేతలు కేక్ కటింగ్ చేసి కార్యకర్తలకు పంచారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పార్టీ అన్ని వర్గాలకు చేసిన మేలును గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఎండగట్టారు. ప్రజాక్షేత్రంలో ప్రజల తరపున పోరాడి కూటమి ప్రభుత్వాన్ని ఓడించి మరోసారి వైఎస్సార్ సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో ఏడు నియోజకవర్గాలలో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకలు ఇలా...
పెదకూరపాడులో...
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల కోసం ప్రజల్లో పుట్టిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని పెదకూరపాడు మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. గురువారం పార్టీ 16 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా క్రోసూరులోని నాలుగు రోడ్ల కూడలిలోని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేసి, కేక్ కట్ చేశారు. పార్టీని నమ్ముకున్న ఉన్న ప్రతి ఒక్క పార్టీ నాయకుడు, కార్యకర్తకు శుభాకాంక్షలు తెలిపి ప్రసంగించారు.
గురజాలలో...
భారతదేశంలో సొంత పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన వ్యక్తులు నలుగురేనని.. వారిలో ఎంజీ రామచంద్రన్, ఎన్టీఆర్, కేసీఆర్, జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి పేర్కొన్నారు. పిడుగురాళ్ల పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం గురువారం నిర్వహించారు. తొలుత పార్టీ జెండాను మాజీ ఎమ్మెల్యే ఆవిష్కరించి కేక్ కట్‌చేశారు.
సత్తెనపల్లిలో...
వైఎస్సార్ సీపీ ప్రజల కష్టాల్లో నుంచి పుట్టుకొచ్చిందని ఆ పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయం వద్ద గురువారం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహ ప్రతిమకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.
మాచర్లలో....
దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాల కోసం 16 సంవత్సరాల కిందట మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ సీపీని ఏర్పాటు చేసి జనంలో తిరుగులేని నాయకుడుగా ఎదిగారని వైఎస్సార్‌సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి పిన్నెల్లి రమాదేవి అన్నారు. గురువారం మాచర్ల నియోజకవర్గ కేంద్రంలో వైఎస్సార్ సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.
వినుకొండలో..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16 ఆవిర్భావ దినోత్సవం వినుకొండలో ఘనంగా నిర్వహించారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సూచనలు మేరకు స్థానిక పార్టీ నాయకులు పార్టీ జెండా ఎగురవేశారు. పార్టీ కార్యాయంలో కేక్ కట్‌చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రజల కోసం... ప్రజా సంక్షేమం కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్ సీపీ అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి విడదల రజిని అన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని ఎన్‌ఆర్‌టీ రోడ్డులో ఉన్న ఆమె నివాస ప్రాంగణంలో గురువారం వైఎస్సార్ సీపీ ఆవిర్బావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి పార్టీ నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్‌సీపీ జెండాను ఆవిష్కరించారు.


