పరాక్‌ రాష్ట్రీయ సర్వేక్షణ్‌పై వర్క్‌షాప్‌ | - | Sakshi
Sakshi News home page

పరాక్‌ రాష్ట్రీయ సర్వేక్షణ్‌పై వర్క్‌షాప్‌

Mar 13 2026 8:10 AM | Updated on Mar 13 2026 8:10 AM

నరసరావుపేట రూరల్‌: పరాక్‌ రాష్ట్రీయ సర్వేక్షణ్‌పై రెండు రోజులపాటు ఎంఏంఎ కళాశాలలో నిర్వహించిన వర్క్‌షాప్‌ గురువారం ముగిసింది. జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులు, ప్రతి మండలం నుంచి ఇద్దరు క్లస్టర్‌ ప్రధానోపాధ్యాయులు, ఇద్దరు స్కూల్‌ అసిస్టెంట్స్‌, ఇద్దరు ఎస్‌జీటీలు వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. ముగింపు సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు పాల్గొని నేషనల్‌ అసెస్మెంట్‌ సర్వే గురించి సమగ్రంగా చర్చించారు. పాఠశాలకు మంచి కరికులం అందించడానికి, జాతీయ, రాష్ట్ర, మండల స్థాయిలో మనం ఏ స్థాయిలో ఉన్నామనేది ఈ వర్క్‌షాపు ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రాథమిక స్ధాయిలో జిల్లా మూడవ స్థానంలో ఉండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వర్క్‌షాపు ఆర్‌పీలుగా ఏఎంవో పూర్ణచంద్రరావు, ఎం.గుర్రుహ్మం, బాల సౌరయ్య, అబ్దుల్‌ ఖాదర్‌లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement