బుల్లెట్‌ బైక్‌ చోరీ | - | Sakshi
Sakshi News home page

బుల్లెట్‌ బైక్‌ చోరీ

Mar 10 2026 12:44 PM | Updated on Mar 10 2026 12:44 PM

బుల్లెట్‌ బైక్‌ చోరీ నాదెండ్ల: చోరీ చేసిన బుల్లెట్‌ వాహనాన్ని నడుపుతుండగా యువకులు వెంబడించి నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన సంఘటన సోమవారం జరిగింది. సాతులూరు గ్రామానికి చెందిన వాహన యజమాని రాచూరి శశి గ్రామంలో ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నిర్వహిస్తుంటాడు. ఆరు నెలల క్రితం బుల్లెట్‌ వాహనాన్ని కొనుగోలు చేశాడు. ఆదివారం నరసరావుపేట సమీపంలో తిరునాళ్లకు వెళ్ళాడు. అక్కడ బైక్‌ చోరీకి గురైంది. తెల్లవారేవరకూ తన మిత్రులతో కలిసి వెతికినా ఫలితం లేకుండా పోయింది. సోమవారం ఉదయం నరసరావుపేటలో వెతుకులాడగా ఓ వ్యక్తి బుల్లెట్‌ వాహనంపై వినుకొండ వైపు వెళ్తుండటాన్ని గుర్తించి వెంబడించి పట్టుకున్నారు. నిందితుడు నరసరావుపేటలో మెకానిక్‌గా పనిచేసే షరీఫ్‌గా గుర్తించారు. నిందితుడిని, బుల్లెట్‌ వాహనాన్ని పోలీసులకు అప్పగించారు. నరసరావుపేట రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు షరీఫ్‌పై గతంలోనూ ద్విచక్రవాహన చోరీ కేసులు ఉన్నాయి. బంగారం దుకాణాల్లో తనిఖీలు హైడ్రా క్రేన్‌ ఢీకొని వ్యక్తి మృతి మంగళగిరి టౌన్‌ : హైడ్రా క్రేన్‌ ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మంగళగిరిలో సోమవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన మధుసూదనరావు (51) తాపీ పనిచేస్తుంటాడు. సోమవారం మధ్యాహ్నం ఇంటికి వెళ్లే క్రమంలో ఆత్మకూరు వద్ద సర్వీస్‌రోడ్‌లో విద్యాభవన్‌ వద్దకు చేరుకునే సరికి వెనుక నుంచి హైడ్రా క్రేన్‌ ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మంగళగిరి రూరల్‌ పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎయిమ్స్‌ వైద్యశాలకు తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రేన్‌ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నరసరావుపేట దుకాణాల్లో చోరీ

వెంబడించి పట్టుకున్న యువకులు

పట్నంబజారు (గుంటూరు ఈస్ట్‌): గుంటూరు నగరం లాలాపేటలోని బంగారం దుకాణాలలో సోమవారం బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండెంట్స్‌ (బీఐఎస్‌) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లాలాపేటలోని సన గోల్డ్‌ టెస్టింగ్‌ దుకాణంపై వచ్చిన ఫిర్యాదు మేరకు దాడులు చేపట్టారు. గత రెండు సంవత్సరాలుగా ఎలాంటి అనుమతులు లేకుండా ఆభరణాల టెస్టింగ్‌ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా హాల్‌మార్క్‌ను బంగారు ఆభరణాలపై మిషన్‌ ద్వారా ముద్రిస్తున్నట్లు తనిఖీల్లో స్పష్టమైంది. బీఐఎస్‌ అధికారి వివేక్‌రెడ్డి మాట్లాడుతూ సన గోల్డ్‌ టెస్టింగ్‌ సెంటర్‌లో లైసెన్సులు లేకుండా హాల్‌మార్క్‌ నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. షాపులో హాల్‌ మార్క్‌ వేసిన నాలుగు ఉంగరాలు, మరికొన్ని ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. లేజర్‌ మిషన్‌, కంప్యూటర్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

మీడియాపై దాడి...

బీఐఎస్‌ అధికారులు సన గోల్డ్‌టెస్టింగ్‌ దుకాణంపై తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో కవరేజ్‌కు వెళ్లిన మీడియాపై షాపు నిర్వాహకులు దాడి చేశారు. మాషాపులోకి ఎలా వస్తారంటూ దుర్భాషలాడుతూ ఇష్టానుసారంగా వ్యవహరించారు.

దుకాణ షట్టర్లు పగలగొట్టి రూ. 50 వేలు అపహరణ

నరసరావుపేట టౌన్‌: ప్రకాష్‌నగర్‌లో వరుసగా ఉన్న నాలుగు దుకాణాల షట్టర్‌ తాళాలు పగలగొట్టి దుండగులు నగదు అపరించుకు వెళ్లిన సంఘటన సోమవారం వెలుగు చూసింది. వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్వామి స్కూల్‌ సమీపంలో వరుసగా ఉన్న నాలుగు దుకాణాలను యజమానులు ఆదివారం రాత్రి యథావిధిగా తాళాలు వేసి వెళ్లారు. సోమవారం ఉదయం షాపులు తెరిచేందుకు వచ్చి చూడగా మెడికల్‌ దుకాణంలోని కౌంటర్‌లో ఉన్న రూ.50వేల నగదు కనిపించలేదు. పక్కనే ఉన్న టైలరింగ్‌ షాప్‌లో కొంత నగదు అపరించుకు వెళ్లారు. ఈ మేరకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ఫిరోజ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement