గత ప్రభుత్వంలో రూ.67కే..
టీడీపీ ప్రభుత్వం కోతలకు పెద్దపీట వేస్తోంది. ఓవైపు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా .. మరోవైపు నిబంధనలతో పథకాలకు పేదలను దూరం చేస్తుంది. తాము అధికారంలోకి వస్తే రేషన్ డిపోల ద్వారా అన్ని రకాల సరుకులు ఇస్తామని హామీలు ఇచ్చి .. తీరా కందిపప్పుకు ఎగనామం పెట్టారు. బహిరంగ మార్కెట్‌లో ధర బాగా ఉండటంతో పేదలు పప్పు అన్నానికి నోచుకోవడం లేదు.
నిరుపేదలకు కందిపప్పు కట్
జిల్లాలో చౌకధరల దుకాణాలు 1,289
సత్తెనపల్లి: పల్నాడు జిల్లాలోని చౌకధరల దుకాణాల్లో కందిపప్పు పంపిణీ చేయకపోవడంతో కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేసే స్థోమత లేకపోవడంతో కందిపప్పు కలేనా అంటూ నిట్టూరుస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలు వచ్చాయి. కందిపప్పు ధర అయితే ఏనాడు లేని విధంగా పెరిగిపోయింది. పౌరసరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేసే కందిపప్పును వినియోగించుకుందామని తెల్ల రేషన్ కార్డుదారులు ఆలోచిస్తుంటే ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఈ ఏడాది జనవరి నెలలో కొద్దిమందికి నామమాత్రంగా కంది పప్పు పంపిణీ చేశారు. ఫిబ్రవరిలో బియ్యంతో పాటు కొంతమందికి పంచదార పంపిణీ చేసి సరిపెట్టేశారు. మార్చిలో అయినా ఇస్తారని కార్డుదారులు ఆశగా ఎదురు చూశారు. ఈ నెలలో కూడా సరఫరా చేయకపోవడంతో తెల్లబోయారు.
బియ్యంతో సరి పెట్టుకో...
ప్రతినెల రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్న ఉచిత బియ్యం మాత్రమే అందజేస్తున్నారు. ప్రతి నెలా ఇచ్చే సరుకులు సక్రమంగా ఇవ్వడం లేదు. బియ్యం, చక్కెర తప్ప మిగిలిన సరుకులు ఇవ్వకపోవడంతో పేదలకు ఇబ్బందులు తప్పడం లేదు. కందిపప్పు ఇవ్వకపోవడంతో స్థానికులు చౌకదుకాణాల డీలర్లను నిలదీస్తున్నారు. కందిపప్పు సరఫరా లేదని, పంచదార ఇచ్చిన మేరకు అయిపోయిందని స్టాక్ రావాల్సి ఉందని వారు చెబుతున్నారని కార్డుదారులు వాపోతున్నారు.
పేదలపై చిన్న చూపు...
జిల్లాలో 1,289 చౌక దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 6,43,453 రైస్ కార్డులు ఉన్నాయి. ఇందులో అధిక శాతం కూలి పనులు చేసుకునే పేదవర్గాల వారే. ప్రభుత్వం పంపిణీ చేసే నిత్యావసరాలే వారికి ఆధారం. ఇందులో కందిపప్పు పూర్తిగా నిలిపివేశారు. పంచదార కూడా పూర్తిస్థాయిలో ఇవ్వకుండా అరకొరగా పంపిణీ చేస్తూ ప్రభుత్వం పేదలపై చిన్న చూపు చూస్తోంది.
కందిపప్పు
గతంలో బయట మార్కెట్లో కిలో కందిపప్పు రూ.150 నుంచి రూ.160 వరకు ఉండేది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో ఎండీయూ వాహనాల ద్వారా కిలో రూ.67కే పంపిణీ చేసేవారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలు మాత్రమే ఎండీయూ వాహనాల ద్వారా అరకొరగా కందిపప్పు పంపిణీ చేసి చేతులెత్తేయడంతో పేద ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేస్తారేమోనని చూస్తే అక్కడ కూడా నో స్టాక్ అంటూ చెప్పేస్తున్నారు.
జిల్లాలో
తెల్లరేషన్
కార్డులు
6,43,453
పల్నాడు
జిల్లా
సమాచారం
తెల్లరేషన్
కార్డుల్లోని
సభ్యులు 18,57,768
అవసరమైన కందిపప్పు
(ఒక కిలో చొప్పున)
643
టన్నులు


