జిల్లా క్రీడాభివృద్ధి అధికారి నరసింహారెడ్డి
నరసరావుపేట ఈస్ట్: సతైనపల్లిరోడ్డులోని డీఎస్‌ఏ స్టేడియంలో ఈనెల 8వ తేదీన శాప్ లీగ్ పోటీల్లో భాగంగా టెన్నిస్, బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహిస్తున్నట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి మంగళవారం తెలిపారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ, జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. పోటీల్లో భాగంగా 40 సంవత్సరాల వయస్సు పైబడిన మహిళలు, పురుషులకు టెన్నిస్, 35 సంవత్సరాలు వయస్సు పైబడిన మహిళలు, పురుషులకు బ్యాడ్మింటన్ పోటీలు జరుగుతాయని తెలిపారు. ఆయా క్రీడల్లో సింగిల్, డబుల్స్, మిక్సడ్ డబుల్ విభాగాలలో నిర్వహిస్తామని వివరించారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు శాప్ వెబ్‌సైట్ లో తమ ఆధార్ కార్డు ద్వారా రిజిస్టర్ కావాలని తెలిపారు. రిజిస్టర్ అయిన క్రీడాకారులను మాత్రమే పోటీలను అనుమతిస్తామని స్పష్టం చేశారు. వివరాలకు 8712622574 నెంబరులో సంప్రదించాలని తెలిపారు.
9న కలెక్టరేట్ వద్ద ధర్నా
రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్) : అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసం భూములు కోల్పోతున్న రైతులు కలెక్టరేట్ వద్ద 9వ తేదీన జరిగే ధర్నాను జయప్రదం చేయాల్సిందిగా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య పిలుపు నిచ్చారు. గుంటూరు బ్రాడిపేటలోని రైతు సంఘం జిల్లా కార్యాలయంలో రాష్ట్ర రైతు, కౌలు, వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశం మంగళవారం అప్పారావు అధ్యక్షతన నిర్వహించారు.


