ఇంటిగుట్టురట్టేనా?
సిబ్బందికి సవాలుగా సర్వే...
సకుటుంబ వివరాల సేకరణ
సర్వేశ్వరా ..
ప్రభుత్వ ఉద్యోగమా .. ప్రైవేట్ ఉద్యోగమా .. స్థిరాస్తి ఎంత ఉంది.. ద్విచక్ర వాహనాలెన్ని ఉన్నాయి .. కార్లు ఉన్నాయా? ఇంట్లో ఫ్యాన్ ఉందా, ఏసీ ఉందా? ఫ్రిడ్జ్ వాడుతున్నారా? తదితర వివరాలను చంద్రబాబు ప్రభుత్వం సేకరిస్తోంది. దీనిపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. తమ ఇంటి గుట్టు భద్రమేనా? లేక రట్టవుతందా? అని మదనపడుతున్నారు.
సత్తెనపల్లి: ప్రజల వ్యక్తిగత వివరాల సేకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే విస్తృతంగా చేపడుతోంది. కింది స్థాయి సిబ్బందిపై ఒత్తిడి పెంచి సర్వేను పూర్తి చేసేందుకు లక్ష్యాలను విధిస్తోంది. అయితే ఈ సర్వేలో పొందుపరిచిన వివరాలను చెప్పేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. విద్య, ఉద్యోగ, స్థిరాస్తి, వాహన వివరాలతో పాటు ఇంట్లో ఉపయోగించే వస్తువుల వివరాలను సైతం అడుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తమ వ్యక్తిగత, ఆస్తి వివరాలు ఎందుకు చెప్పాలంటూ సర్వేకు వెళ్లిన సచివాలయ ఉద్యోగులను చాలామంది నిలదీస్తున్నారు. మా నుంచి సేకరిస్తున్న వ్యక్తిగత వివరాలు భద్రమేనా? అంటూ మదనపడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత వివరాలను సేకరించడంపై దృష్టి సారించడం వెనుక ఏదో మతలబు ఉందంటూ ఆందోళన చెందుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా 538 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిల్లో పనిచేస్తున్న వారిలో 3,700 మంది ఉద్యోగులకు ఈ సర్వే బాధ్యత అప్పగించారు. ఇప్పటి వరకు సుమారు నాలుగు లక్షల కుటుంబాలు సర్వే పూర్తి కాగా .. ఇంకా మూడు లక్షల కుటుంబాల వరకు సర్వే చేయాల్సి ఉంది. దీనిపై మండల స్థాయి అధికారుల మానిటరింగ్‌తోపాటు జిల్లా అధికారులు నిత్యం కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తుండటంతో ప్రస్తుతం యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే వేగవంతంగా కొనసాగుతుంది. ప్రతి రోజూ ఈ సర్వేపై ఉన్నతాధికారులు ఆరాఽ తీస్తున్నారు. లక్ష్యం మేరకు సర్వే పూర్తి చేయాల్సిందేనంటూ కిందిస్థాయి సిబ్బందిపై మండల స్థాయి అధికారులు ఒత్తిడి పెంచుతున్నారు. ప్రజల నుంచి సానుకూలత లేకపోవడం, సర్వేను సకాలంలో పూర్తి చేయకపోవడంతో సర్వే సిబ్బందికి ప్రజల నుంచి నిరాకరణ, అధికారుల నుంచి వేధింపులు తప్పడం లేదు.
విద్య, ఉద్యోగ వివరాలతో ప్రభుత్వం సర్వే చేయడం సర్వసాధారణం. అయితే గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా చంద్రబాబు ప్రభుత్వం సకుటుంబ సపరివారంగా పూర్తి వివరాలను సేకరిస్తుండడంపై ప్రజల్లో అలజడి నెలకొంది. ఇంట్లో వినియోగించే వస్తువులు, స్థిరాస్తి వివరాలను ఎందుకు చెప్పాలంటూ మండిపడుతున్నారు. వీటన్నింటితోపాటు కుల ధ్రువీకరణను సైతం సర్వే సిబ్బందికి చూపించాల్సిన పరిస్థితి ఎదురవుతుండడంపై ప్రజలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. సర్వే సిబ్బంది ప్రజలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. తాము అడిగిన వివరాలు చెప్పాల్సిందేనంటూ ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వం సేకరించాలని చెప్పిన వివరాలను మాత్రమే తాము అడుగుతున్నామని ఎంత చెప్పినా ప్రజలు సర్వేలో వివరాలు చెప్పేందుకు అయిష్టతను వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత వివరాలను చెప్పబోమంటూ మండిపడుతున్నారు.
సత్తెనపల్లి గవర్నమెంట్ కాలేజీ గేటు వద్ద డీవో కారును ముట్టడించిన విద్యార్థులు
ముట్టడి నుంచి డీవోను లోపలికి పంపే ప్రయత్నం చేస్తున్న ఏఎస్‌ఐ మస్తాన్ వలి
ఇంటర్ బాలికలతో డీవో అసభ్య ప్రవర్తన
యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే సచివాలయ ఉద్యోగులకు శాపంగా మారింది. సర్వే చేసేందుకు రోజువారి లక్ష్యాలు విధించడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ప్రజల నుంచి సరైన స్పందన లేకపోవడంతో మళ్లీ మళ్లీ అదే ఇంటికి తిరగాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఒక ఇంటి దగ్గర సర్వే చేయాలంటే కనీసం 30 నుంచి 45 నిమిషాలకు పైగా సమయం పడుతోంది. దీంతోపాటు సర్వర్ డౌన్ సమస్య వేధిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఇంటి సర్వే గంటకు పైగా సమయం పడుతోంది. ప్రజలు సర్వేపై అయిష్టత వ్యక్తం చేస్తుండడంతో సచివాలయ ఉద్యోగులు వారిని ఒప్పించేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో సర్వేకు సమయం తీసుకుంటోంది. ఉన్నతాధికారులు మాత్రం సర్వే సిబ్బందిని వేధించి వీధుల్లోకి తరుముతున్నారు. ఒక్కో సిబ్బంది రోజుకు పది ఇళ్లు సర్వే చేయాలని ఆదేశించగా అధికారులు మాత్రం 20కి తగ్గకుండా చేయాల్సిందే అంటూ హుకుం జారీ చేస్తున్నారు. టీడీపీ, జనసేన నేతల నుంచి సిఫార్సు చేయించుకుని పలువురు డిప్యూటేషన్ల పై మరో ప్రాంతంలో పనిచేస్తున్నారు. అలాంటి సిబ్బందికి సర్వే పోటు తప్పింది. ఈ పని భారం సచివా లయాల్లో అరాకొరాగా ఉన్న సిబ్బందికి రెట్టింపు అయ్యింది.
వ్యక్తిగత వివరాలు భద్రమేనా?
సకుటుంబ వివరాల సేకరణకు
నడుం బిగించిన బాబు ప్రభుత్వం
విద్య, ఉద్యోగ, స్థిరాస్తి వివరాల
సేకరణ
వినియోగించే వస్తువుల గురించీ ఆరా
అడిగిన వివరాలు
చెప్పాల్సిందేనంటూ ఒత్తిడి
జిల్లాలో సర్వే చేయాల్సిన
కుటుంబాలు ఇంకా మూడు లక్షలు
యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేపై
ప్రజల్లో ఆందోళన
యూనిఫైడ్ డ్ ఫ్యామిలీ సర్వే (యూఎఫ్‌ఎస్) ద్వారా ప్రభుత్వం కుటుంబ వ్యక్తిగత వివరాలను క్షుణ్ణంగా సేకరిస్తోంది. కుటుంబంలో ఎంతమంది సభ్యులుంటే అంత మందికి సంబంధించిన పూర్తి వివరాలను సర్వే యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఒక్కో సభ్యుడు వివరాలు నమోదు చేయడానికి ఒక్కో ఓటీపీ సర్వే సిబ్బందికి ఇస్తే గాని యాప్‌లో వివరాలు నమోదు కావడం లేదు. ప్రతి ఒక్కరికి సంబంధించిన విద్య (కోర్సులతో సహా) ఉద్యోగ వివరాలు, ఉద్యోగం చేస్తుంటే ఎలాంటి ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగమా లేదా ప్రైవేట్ ఉద్యోగమా తదితర సమాచారం. స్థిరాస్తి వివరాలు, ద్విచక్ర, కార్లు వినియోగ వివరాలు, ఇంట్లో ఫ్యాన్ ఉందా, ఏసీ ఉందా?, ఫ్రిడ్జ్ వంటి ఇంట్లో వినియోగించే వస్తువుల వివరాలను సైతం చెప్పాల్సిన పరిస్థితిని ప్రభుత్వం తీసుకువచ్చింది.ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా వ్యక్తిగత పూర్తి వివ రాలు సేకరించడం పై ప్రజల్లో అయోమయం నెలకొంది.
నేడు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల ప్రత్యేక పీజీఆర్‌ఎస్
నరసరావుపేట: కలెక్టరేట్‌లో శనివారం ఉదయం 10 గంటలకు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా వర్గాల వారు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.


