బాత్రూమ్‌కు వెళ్లాలా.. షుగర్‌ టెస్ట్‌ రిపోర్ట్‌ తీసుకురండి! | - | Sakshi
Sakshi News home page

బాత్రూమ్‌కు వెళ్లాలా.. షుగర్‌ టెస్ట్‌ రిపోర్ట్‌ తీసుకురండి!

Feb 28 2026 7:15 AM | Updated on Feb 28 2026 7:15 AM

బాత్ర

బాత్రూమ్‌కు వెళ్లాలా.. షుగర్‌ టెస్ట్‌ రిపోర్ట్‌ తీసుకుర

సత్తెనపల్లి: పరీక్ష సమయంలో బాత్రూమ్‌కు వెళ్లేందుకు అనుమతి అడిగినందుకు డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌(డీవో) అసభ్యకర మాటలతో వేధించారంటూ ఇంటర్మీడియెట్‌ విద్యార్థినులు శుక్రవారం ఆందోళనకు దిగారు. బాధితులు మాట్లాడుతూ.. సత్తెనపల్లిలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో తాము పరీక్షలు రాస్తున్నట్లు చెప్పారు. డీవో రోజూ తమను మాటలతో ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. పరీక్ష సమయంలో బాత్రూమ్‌కు వెళ్లేందుకు అనుమతి అడిగితే ఆయన ‘మీకు షుగర్‌ ఉందా? రేపు పరీక్షకు వచ్చేటప్పుడు షుగర్‌ పరీక్ష చేయించుకొని రిపోర్ట్‌ తీసుకురండి. బాత్రూమ్‌కు వెళ్లి ఎక్కడ ఏమి పెట్టుకుని వస్తారో’ అంటూ అసభ్యంగా మాట్లాడారంటూ వాపోయారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో కాలేజీ గేటు వద్ద ఆందోళన చేస్తున్న సమయంలో డీవో రాగా.. ఆయన కారును వారు ముట్టడించారు. ఈ విషయం తెలుసుకున్న పట్టణ ఏఎస్‌ఐ మస్తాన్‌వలి, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులకు నచ్చజెప్పి.. డీవోను కాలేజీ లోపలికి పంపించారు. ఈ ఘటనపై ఇంటర్‌ బోర్డు డీవీఈవో నీలావతికి ఫిర్యాదు చేసినట్లు విద్యార్థులు తెలిపారు. ఆమె పరీక్షా కేంద్రాన్ని సందర్శించి విచారణ చేపట్టినట్లు సమాచారం.

బాత్రూమ్‌కు వెళ్లాలా.. షుగర్‌ టెస్ట్‌ రిపోర్ట్‌ తీసుకుర1
1/1

బాత్రూమ్‌కు వెళ్లాలా.. షుగర్‌ టెస్ట్‌ రిపోర్ట్‌ తీసుకుర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement