
గంజాయితో పాటు నగలు, నగదు స్వాధీనం
గంజాయి ముఠా
సభ్యుల అరెస్ట్
చిలకలూరిపేట: గంజాయి విక్రయాలకు పాల్పడటంతోపాటు సేవిస్తున్న ముఠా సభ్యులను చిలకలూరిపేట రూరల్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నరసరావుపేట డీఎస్పీ ఎం హనుమంతరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మత్తు పదార్థాలకు అలవాటు పడి గంజాయి అక్రమంగా రవాణా చేస్తూ యువత, విద్యార్థులను చెడు మార్గాల వైపు నడిపిస్తున్న ముఠాపై రూరల్ సీఐ బి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో మూడు టీములు ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. ముఠాకు నాయకుడిగా వ్యవహరిస్తున్న గణపవరం రాజీవ్‌గాంధీ కాలనీకి చెందిన అన్నంరాజు ఈశ్వరసాయికుమార్‌తోపాటు నేలపాటి ఠాగూర్, షేక్ హుస్సేన్‌భాష, షేక్ బాజీ, పల్లపు నాగబాబు, కుంచాల రవితేజ, పల్లపు కళ్యాణ్‌కుమార్, తెప్పలి వెంకటేష్, గుద్దంతి సురేష్, సింగంశెట్టి ప్రవీణ్‌కుమార్, షేక్ జాన్‌బాష, సొంటినేని పవన్‌కళ్యాణ్, పులగం సాయివెంకటేష్, నక్కల ఏసుబాబు, నాగండ్ల ఆదిత్యలను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రెండు కేజీల 440 గ్రాముల గంజాయి, రూ. 3500 నగదు, ఒక సెల్‌ఫోన్, 117 గ్రాముల బంగారం స్వాఽధీనం చేసుకున్నారు. ఇందులో ముఖ్యంగా అన్నంరాజు ఈశ్వరసాయికుమార్ తొలినుంచి గంజాయి కొనుగోలు చేస్తూ మిగిలిన వారితో విక్రయాలు చేయిస్తున్నాడు. ఈ నెల 11న ఒడిశాకు చెందిన వలస కార్మికుడు ఉత్తం రౌత్‌ను గంజాయి మత్తులో బీర్ సీసాతో పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇంకా ఈ ముఠాలో సభ్యులను గాలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో రూరల్ సీఐ బి సుబ్బానాయుడు, ఎస్‌ఐ జి అనిల్‌కుమార్, నాదెండ్ల ఎస్‌ఐ జి పుల్లారావు, ఏఎస్‌ఐలు డి రోసిబాబు, జీవీ సుబ్బారావు, పి రమేష్, కానిస్టేబుళ్లు కె దేవరాజు, జె శ్రీధర్, ప్రసాద్, అనిల్‌కుమార్, వెంకట్రావు, ఎం. ఇర్మియా తదితరులు పాల్గొన్నారు.