
మహనీయుల త్యాగాలు స్మరించుకోవాలి
జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు పలుచోట్ల స్వాతంత్య్ర వేడుకలు
నరసరావుపేట రూరల్: స్వేచ్ఛ, సమానత్వం కోసం మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. జాతీయ జెండాను జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఎగురవేసి గౌరవవందనం స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం ఉట్టి పడే విధంగా కుల, మత, వర్గ, ఆర్థిక భేదాలు పక్కన పెట్టి దేశమంతా జరుపుకునే ఏకై క వేడుక స్వాతంత్య్ర దినోత్సవం అన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్, అదనపు ఎస్పీ(ఏఆర్) వి.సత్తిబాబు, అదనపు ఎస్పీ(క్రైమ్)లక్ష్మీపతి, ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీ రెడ్డి, ఎస్బీ సీఐలు బి.సురేష్‌బాబు, పి.శరత్‌బాబు, ఆర్‌ఐలు ఎస్.కృష్ణ, ఎల్.గోపినాథ్, ఎం.రాజా తదితరులు పాల్గొన్నారు.