
మాజీ ఎమ్మెల్యే బొల్లా
జాతీయ జెండాను అవమానించడం బాధాకరం
గుంటూరు: వినుకొండలో జాతీయ జెండాకు అవమానం జరగటం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు, ప్రభుత్వ చీఫ్ విప్ జి.వి.ఆంజనేయులుకు జాతీయ జెండా కన్పించడం లేదా అని ప్రశ్నించారు. కోట్లాది మంది భారతీయులు దైవంగా భావించే జాతీయ జెండాను బూటు కాళ్లతో తొక్కడం బాధాకరమన్నారు. గతంలో వినుకొండలో ఉన్న ఒకే ఒక్క గాంధీ విగ్రహం ట్రాఫిక్‌కు అడ్డంగా ఉందని తొలగించారని పేర్కొన్నారు. నేడు జాతీయ జెండాను అవమానించారు. ఇప్పటికై నా తీరుమార్చుకోవాలని హితవు పలికారు.
కోతకు గురైన బుగ్గువాగు బ్రిడ్జి
మూడు రోజుల నుంచి రాకపోకలు బంధ్ స్పందించని అధికారులు
పిడుగురాళ్ల: ఇటీవల కురిసిన వర్షాలకు పట్టణంలోని బుగ్గువాగు బ్రిడ్జి ఇరువైపులా కోతకు గురవ్వటంతో రాకపోకలు స్తంభించాయి. మూడు రోజుల నుంచి రాకపోకలకు త్రీవ అంతరాయం ఏర్పడింది. అటువైపు వెళ్లే ప్రజలు బైపాస్ రోడ్డుపై నుంచి పట్టణంలోనికి రావాల్సి ఉంది. ఈ ప్రాంతంలో సుమారు 200 గృహాల వారు నిసిస్తున్నారు. వారందరికి రాకపోకలకు పట్టణంలోకి వచ్చే అవకాశం లేకుండా ఈ బ్రిడ్జి కోతకు గురైంది. తప్పనిపరిస్థితుల్లో సుమారు రెండు కిలోమీటర్ల మేర పిడుగురాళ్ల పట్టణంలోకి రావాల్సి ఉంది. మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే కోతకు గురైన రోడ్డును పూడ్చాలని, తరచూ వచ్చే వరదలకు కోతకు గురవుతుంది కాబట్టి శాశ్వత పరిష్కారం వైపు అధికారులు అడుగులు వేయాలని స్థానికులు కోరుకుంటున్నారు.

మాజీ ఎమ్మెల్యే బొల్లా