
దేశ అభివృద్ధిలో రైల్వేశాఖది కీలక పాత్ర
రైల్వే డీఆర్‌ఎం సుథేష్ఠ సేన్ ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు
లక్ష్మీపురం: భారతీయ రైల్వేలు కేవలం రవాణా సాధనం కాదు, మన దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని రైల్వే డీఆర్‌ఎం సుథేష్ఠ సేన్ అన్నారు. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని నల్లపాడు మైదానంలో 79వ స్వాతంత్య్ర వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తొలుత రైల్వే పోలీసులు నిర్వహించిన పరేడ్‌లో పాల్గొని జాతీయ పతాకాన్ని డీఆర్‌ఎం ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. గత ఆర్థిక సంవత్సరం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో డివిజన్ అనేక రకాల విజయాలను, లక్ష్యాలను సాధించిందన్నారు. కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో..
నగరంపాలెం: దేశ వ్యాప్తంగా అందరూ నిర్వర్తించుకునే వేడుక స్వాతంత్య్ర దినోత్సవమని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర వేడుకలు జరగ్గా, జాతీయ జెండాను జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఎగురవేశారు. జిల్లా ఏఆర్ ఏఎస్పీ హనుమంతు, ఏవో అద్దంకి వెంకటేశ్వరరావు, ఏఆర్ డీఎస్పీ ఏడుకొండలరెడ్డి, ఎస్‌బీ సీఐ అళహరి శ్రీనివాస్, ఆర్‌ఐలు శ్రీహరిరెడ్డి, శివరామకృష్ణ, సురేష్, పోలీస్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
సాంకేతిక పరిజ్ఞానంతో
నేరాలు అదుపు
మంగళగిరిటౌన్: అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో నేరాలను అదుపు చేస్తున్నామని ప్రొబెషన్ అండ్ ఎకై ్సజ్ రాష్ట్ర శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ అన్నారు. మంగళగిరి నగర పరిధిలోని ప్రొబెషన్ అండ్ ఎకై ్సజ్ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం స్వాతంత్య్ర వేడుకలను నిర్వహించారు. శాఖ డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మతో కలసి కమిషనర్ నిశాంత్ కుమార్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. శాఖలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మ, జాయింట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.
పెదకాకాని(ఏఎన్‌యూ): భారతదేశం విదేశీయుల పాలన నుంచి స్వేచ్ఛా స్వాతంత్య్రాలను సాధించేందుకు కృషిచేసి అశువులు బాసిన త్యాగధనుల పోరాటాలను నేటి యువత స్మరించుకోవాలని ఏఎన్‌యూ ఇన్‌చార్జి వీసీ ఆచార్య కె గంగాధరరావు అన్నారు. వర్సిటీలోని వ్యాయామ విద్య కళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు వ్యాయామ విద్య కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పిపిఎస్ పాల్‌కుమార్ అధ్యక్షత వహించారు. తొలుత జాతీయపతాకాన్ని ఎగురవేశారు. ఇన్‌చార్జి రెక్టార్ ఆచార్య కె రత్నషీలామణి, ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ఆచార్య జి సింహాచలం, ప్రిన్సిపల్స్ ఆచార్య ఎం.సురేష్‌కుమార్, ఆచార్య వీరయ్య, ఆచార్య సిహెచ్ లింగరాజు, ఆచార్య ప్రమీళారాణి, అసిస్టెంట్ ప్రిన్సిపాల్ డాక్టర్ డి చంద్రమౌళి, డిగ్రీ, పీజీ పరీక్షల కోఆర్డినేటర్లు ఆచార్య కృష్ణారావు, ఆచార్య సుబ్బారావు, సీడీఈ డైరెక్టర్ ఆచార్య వెంకటేశ్వర్లు, పరీక్షల కోఆర్డినేటర్ రామచంద్రన్, విదేశీ విద్యార్థుల సెల్ డైరెక్టర్ ఆచార్య పద్మావతి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి ఆచార్య దివ్యతేజోమూర్తి, సోషల్‌వర్క్ విభాగాధిపతి ఆచార్య యం త్రిమూర్తిరావు, సీఐ, ఏసిఇ, ఇంజనీర్, డిప్యూటీ ఇంజినీర్లు, అధ్యావకులు, గెస్ట్ ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
అమరవీరుల త్యాగాల ఫలితంగానే స్వాతంత్య్రం
కొరిటెపాడు(గుంటూరు): ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగానే స్వాతంత్య్రం వచ్చిందని, వాటి ఫలాలను పరిరక్షించు కోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని భారత పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.విశ్వశ్రీ పేర్కొన్నారు. జీటీ రోడ్‌లోని పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర వేడుకలను నిర్వహించారు. జాతీయ పతాకాన్ని వారు ఆవిష్కరించారు. యశ్వంత్‌కుమార్, విశ్వశ్రీ మాట్లాడుతూ దేశంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు ఉండాలని, మన దేశప్రగతిని, సాధించిన లక్ష్యాలను గుర్గుపెట్టుకొని మనమంతా ముందుకు సాడాలని కోరారు. కార్యక్రమంలో పొగాకు బోర్డు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్ర విపత్తుల కార్యాలయంలో....
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని రాష్ట్ర విపత్తుల కార్యాలయంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్‌జైన్ త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు, యోధులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దీపక్, ఎన్‌డీఆర్‌ఎఫ్,ఫైర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

దేశ అభివృద్ధిలో రైల్వేశాఖది కీలక పాత్ర

దేశ అభివృద్ధిలో రైల్వేశాఖది కీలక పాత్ర

దేశ అభివృద్ధిలో రైల్వేశాఖది కీలక పాత్ర