ఆంధ్రా అమ్మాయి... జవహర్‌నగర్‌ మేయర్‌ | - | Sakshi
Sakshi News home page

ఆంధ్రా అమ్మాయి... జవహర్‌నగర్‌ మేయర్‌

Mar 19 2024 1:40 AM | Updated on Mar 19 2024 1:18 PM

- - Sakshi

ముత్తాయపాలేనికి చెందిన శాంతి సోమవారం మేయర్‌గా ప్రమాణ స్వీకారం ఆనందంలో గ్రామస్తులు

బాపట్ల టౌన్‌: బాపట్ల మండలం, ముత్తాయపాలెం గ్రామానికి చెందిన పమిడిబోయిన శాంతి తెలంగాణ రాష్ట్రంలోని జవహర్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా ఎంపికయ్యారు. ఆమె బాపట్ల మండలం, ముత్తాయపాలెం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో విద్య అభ్యసించారు. 2000లో తెనాలి మండలం, దావులూరిపాలెం గ్రామానికి చెందిన కోటేష్‌గౌడ్‌తో వివాహమైంది.

గడిచిన 20 సంవత్సరాల నుంచి హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నారు. 2021లో జరిగిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో 18వ డివిజన్‌ నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆ పార్టీ కార్పొరేటర్లంతా కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపడంతో ముత్తాయపాలెం గ్రామానికి చెందిన మహిళ శాంతి మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈ మేరకు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement