ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య

Nov 28 2023 2:20 AM | Updated on Nov 28 2023 8:05 AM

- - Sakshi

ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం పట్టణ శివారులోని ఇంజినీరింగ్‌ కళాశాలలో చోటుచేసుకుంది.

పల్నాడు: ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం పట్టణ శివారులోని ఇంజినీరింగ్‌ కళాశాలలో చోటుచేసుకుంది. వివరాలు.. ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థిని పట్టణంలోని ఇంజినీరింగ్‌ కళాశాల హాస్టల్‌లో ఉంటూ ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరం ఈసీఈ చదువుతోంది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో బాత్‌రూమ్‌లోకి వెళ్లి హెయిర్‌లోషన్‌ తాగింది.

కొంత సేపటికి వాంతులు కావడంతో గమనించిన తోటి విద్యార్థులు హాస్టల్‌ వార్డెన్‌కు సమాచారం ఇచ్చారు. ప్రథమ చికిత్స అనంతరం పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందింది. ఓత్తిడిని తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement