జల విలయం..! | - | Sakshi
Sakshi News home page

జల విలయం..!

Sep 13 2026 1:24 AM | Updated on Sep 13 2026 1:24 AM

మల్కన్‌గిరి జిల్లాలో గత రెండు రోజులుగా కూరుస్తున్న వర్షాలకు పొట్టేరు వంతెనపైకి వరద నీరు చేరింది. దీంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. పోలీసులు వంతెనపై వాహనాల రాకపోకలు నిషేధిస్తూ హెచ్చరికలు జారీ చేశారు. అలాగే కోరుకొండ సమితి నీలకంబేరు పంచాయతీ వద్ద కల్వర్ట్‌ కూలిపోవడంతో రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మల్కన్‌గిరి నుంచి ఛత్తీష్‌గడ్‌ సుకుమాకు ఉన్న ముఖ్య రహదారి సైతం వరద నీటితో నిండిపోయింది. దీంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. భారీవర్షాల వలన లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్‌ ప్రథమేశ్‌ స్వయంగా పొట్టేరు వంతెన వద్దకు వెళ్లి పరిస్థితిని పరిశీలించి అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. – మల్కన్‌గిరి

నీలకంబేరు గ్రామం వద్ద కూలిన కల్వర్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement