చట్టాలపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహన అవసరం

Sep 13 2026 1:24 AM | Updated on Sep 13 2026 1:24 AM

జయపురం: ప్రజలకు చట్టాలపై అవగాహన అవసరమని వక్తలు పేర్కొన్నారు. జయపురం పంచాయతీ సమితి బరిణిపుట్‌లో సంచార లీగల్‌ ఎయిడ్‌ శిబిరం శనివారం నిర్వహించారు. దీనిలో భాగంగా న్యాయవాదులు డి.సల్మాన్‌ నాగ్‌, గాయత్రీ పట్నాయిక్‌, ప్రభావతీ రాణి లిమలు పాల్గొని గ్రామస్తులకు ఉచిత న్యాయ సహాయ చట్టాలు, ప్రభుత్వ సామాజిక భద్రతా, సంక్షేమ, సహాయ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు తాము సహకరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బరిణిపుట్‌ పంచాయతీ సర్పంచ్‌ పద్మానంద, నాయిక్‌ సర్పంచ్‌ బసంత బరాజ్‌, సీఎస్‌ఎన్‌ఆర్‌ ప్రతినిధులు అరవింద సడుంగా, సునీల్‌ మిశ్ర, అజయ జ్యోత్న తదితరులు పాల్గొన్నారు.

భారీగా గంజాయి పట్టివేత

మల్కన్‌గిరి: జిల్లాలోని కోరుకొండ సమితి బలిమెల పోలీసులు శుక్రవారం రాత్రి చిమిటాపల్లి పంచాయతీ పరిధి బొండిగూడ గ్రామం వద్ద భారీగా గంజాయిని పట్టకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామం వద్ద పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో ఒక పికప్‌ వ్యాన్‌ అతివేగంతో రావడంతో ఎస్‌ఐ ధనుర్జయ్‌ ఖీలో ఆపి తనిఖీ చేశారు. క్యాబేజీ లోడ్‌ దిగువన తెల్ల బస్తాలు ఉండడంతో అనుమానం వచ్చి పరిశీలించగా గంజాయి పట్టుబడింది. అనంతరం వాహనంలో ఉన్న ఇద్దరిని అరెస్టు చేశారు. ఐఐసీ రీగాన్‌కీండో ఆధ్వర్యంలో గంజాయిని తూకం వేయగా 325 కిలోలు ఉంది. దీని విలువ సుమారు రూ.50 లక్షలు వరకు ఉటుందని పోలీసులు తెలిపారు. అరైస్టెనవారిలో కోరుకొండ సమితి ఎంవీ 34 గ్రామానికి చెందిన శరత్‌ చంద్ర వర్మన్‌, కలిమెల సమితికి చెందిన తాపస్‌ పాల్‌ ఉన్నట్లు గుర్తించారు. వీరి వద్ద నుంచి రూ.3,500ల నగదు, సెల్‌ఫోన్లు, క్యాబేజీలు స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం కోర్టులో హాజరుపరుస్తామన్నారు.

పట్టుబడిన చోరీ కేసుల

నిందితుడు

పర్లాకిమిడి: పట్టణంలోని కేవుటివీధి, ఖంజావీధుల్లో వరుసగా దొంగతనాలకు పాల్పడిన సంజయ్‌గాంధీ కాలనీకి చెందిన నిందితుడు చింతల కల్యాణ్‌ను ఆదర్శ పోలీసుస్టేషన్‌ సిబ్బంది పట్టుకుని అరెస్టు చేసినట్టు ఐఐసీ ప్రశాంత భూపతి తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 9న కేవుటివీధిలో వి.ధమర్‌నాథ్‌ అలియాస్‌ వి.ధర్మానంద ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా, నిందితుడు ఈనెల 8వ తేదీ రాత్రి 2 గంటల సమయంలో ధర్మానంద ఇంట్లో పెరటి నుంచి వచ్చిన సందర్భంగా ఇంటి యజమాని నిద్రలేవడంతో, అక్కడ ఉన్న మొబైల్‌ను పట్టుకుని పారిపోయాడు. అదే రాత్రి ఖంజావీధిలో సుకాంత బోరాడో ఇంట్లో చొరబడి దొంగతనంకు విఫలయత్నం జరిపి ఒక మొబైల్‌ను తీసుకుని పారిపోయాడు. అలాగే ఆగస్టు 31వ తేదీన హోంగార్డు సుజిత్‌ కుమార్‌ మహాపాత్రో ఇంటి వద్ద ద్విచక్ర వాహనం దొంగిలించాడు. ఈ మూడు కేసులను ఎస్‌ఐ ప్రఫుల్ల జగరంగా, ఏఎస్‌ఐ శక్తి పాడి, హవల్దార్‌ పూర్ణచంద్రమిశాల్‌, ఎస్‌ఐ రామకృష్ణ దాస్‌లు దర్యాప్తుచేసి రెండు సెల్‌ఫోన్లు, హీరోహోండా బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని శనివారం కోర్టుకు తరలించినట్లు ఐఐసీ ప్రశాంత్‌ భూపతి తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement