● ఒకరు దుర్మరణం
మల్కన్‌గిరి: కారు, బైక్ ఢీకున్న సంఘటనలో ఒకరు దుర్మరణం చెందారు. ఈ విషాద సంఘటన మల్కన్‌గిరి సమితి టిటిబిరి గ్రామం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మల్కన్‌గిరి నుంచి సుక్మ వైపు వెళ్తున్న కారు టిటిబరి గ్రామానికి చెందిన యువకుడు రాము మడ్కమి (21) ద్విచక్ర వాహనంపై వస్తుండుగా కారు బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో రాము అక్కడిక్కడే మృతి చెందారు. అయితే ప్రమాదం అనంతరం కారు వదిలి డ్రైవర్ పరారైయ్యాడు. ఘటనను చూసిన స్థానికులు మల్కన్‌గిరి ఆదర్శ పోలీసుస్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో ఐఐసీ దేవదత్తు మల్లిక్ చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మల్కన్‌గిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు ఐఐసీ దేవదత్తు మల్లిక్ తెలిపారు.


