కొరాపుట్: నీట్ పేపర్ లీకేజీపై న్యూఢిల్లీలోని విద్యార్థుల ఆందోళనలు కొరాపుట్ జిల్లాకు చేరాయి. దేశ రాజధానిలో విద్యార్థులపై లాఠీచార్జీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో కొరాపుట్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ జంక్షన్ వద్ద స్థానికులు మంగళవారం ఆందోళన చేపట్టారు. వాంగ్‌చుక్‌కి మద్దతుగా నినాదాలు చేశారు. ఒడిశాకి చెందిన కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ పనితో ఒడిశా పేరు గంగలో కలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు దమంజోడిలో ప్రజా సంఘాలు భారీర్యాలీ చేపట్టారు. ఢిల్లీలో విద్యార్థులకు సంఘీభావంగా నినాదాలు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత కల్పించారు. నీట్ పరీక్ష రద్దు వలన ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థులకు నివాళులర్పించారు. కాక్రోచ్ జనతా పార్టీని కొరాపుట్ జిల్లాలో ప్రారంభించడానికి ఈ ర్యాలీలో నిర్ణయాలు జరిగాయి. ఇంటిలిజెన్స్ వర్గాలు ఈ ఆందోళనపై వివరాలు సేకరిస్తున్నాయి.


