వామనావతారంలో జగన్నాథుడు | - | Sakshi
Sakshi News home page

వామనావతారంలో జగన్నాథుడు

Jul 22 2026 2:29 AM | Updated on Jul 22 2026 2:29 AM

వామనావతారంలో జగన్నాథుడు

రాయగడ: గుండిచా మందిరంలో కొలువైవున్న జగన్నాథ, బలభద్ర, సుభద్ర దేవతామూర్తులు భక్తుల ద్వారా ప్రత్యేక పూజలను అందుకుంటున్నారు. దశావతారాల్లో భాగంగా స్వామివారు మంగళవారం వామనావతారంలో భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు. అలాగే ప్రతిరోజూ ప్రత్యేక పూజలతో పాటు సంధ్యా హారతి కొనసాగుతున్నాయి. రథయాత్రలో భాగంగా గుండిచా ప్రాంగణలో సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నారు.

పర్లాకిమిడిలో...

రథయాత్రలో భాగంగా జగన్నాథుడు వామన, బలరాముడు పరశురాం అవతారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది యాత్రికులు గుండిచా మందిరం వద్ద స్వామివారిని దర్శించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement