రాష్ట్రంలో.. రాష్ట్రపతి పర్యటన | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో.. రాష్ట్రపతి పర్యటన

Jul 22 2026 2:29 AM | Updated on Jul 22 2026 2:29 AM

రాష్ట్రంలో.. రాష్ట్రపతి పర్యటన

భువనేశ్వర్‌: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశాలో పర్యటించనున్నారు. ఆమె ఆగస్టు 3 నుంచి 5వ తేదీ వరకు మూడు రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా భువనేశ్వర్‌, కటక్‌, బరంపురం ప్రాంతాల్లో పలు కార్యక్రమాలకు హాజరవుతారు. ఆగస్టు 3న భువనేశ్వర్‌ చేరుకున్న అనంతరం రాష్ట్రపతి స్థానిక లోక్‌సేవా భవన్‌లో బస చేస్తారు. అదేరోజు కటక్‌లో జరిగే జగద్గురు కృపాలు విశ్వ విద్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఆగస్టు 4వ తేదీ ఉదయం భువనేశ్వర్‌ నుంచి ప్రత్యేక రైలులో బరంపురం రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డు మార్గంలో తప్తపానికి వెళ్లి మా కంధుని దేవి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత గోపాల్‌పూర్‌లోని ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్‌ కాలేజీలో లేదా మరేదైనా నిర్దేశిత ప్రదేశంలో రాత్రి బస చేస్తారు. ఆగస్టు 5న గోపాల్‌పూర్‌ నుంచి బరంపురం రైల్వేస్టేషన్‌కు చేరి ప్రత్యేక రైలులో భువనేశ్వర్‌కు తిరిగి వస్తారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ వెళ్తారు. రాష్ట్రపతి పర్యటన కోసం సిద్ధం చేసిన ముసాయిదా షెడ్యూల్‌ను రాష్ట్రపతి భవన్‌ రాష్ట్ర ప్రభుత్వంలో సంబంధిత శాఖలకు పంపింది. రాష్ట్రపతి రైలు ప్రయాణం కోసం భువనేశ్వర్‌ మరియు బరంపురం రైల్వేస్టేషన్లలో భద్రత, ప్లాట్‌ఫాం ఏర్పాట్లు, గ్రీన్‌ రూమ్‌లు, వీవీఐపీల రాకపోకలు, ప్రత్యేక కోచ్‌ల ఏర్పాట్లు, రైల్వేలతో సమన్వయంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement