జయపురం: నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీల ఆదేశాల మేరకు కొరాపుట్ జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా సెషన్స్ జడ్జి, జిల్లా న్యాయసేవా ప్రదీకరణ అధ్యక్షుడు ప్రదీప్ కుమార్ మహంతి పర్యవేక్షణలో జిల్లా న్యాయస్థానం జయపురం ప్రాంగణంలో శనివారం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ ప్రత్యేక లోక్ అదాలత్‌లో చెక్ బౌన్స్ కేసులు పరస్పర అంగీకారంతో పరిష్కరించారు. మొత్తం 16 కేసుల్లో 10 కేసులు పరిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవా ప్రదీకరణ కార్యదర్శి, అదాలత్ శాశ్వత విచారపతి ప్రద్యుమయి సుజాత, ప్రథమ శ్రేణి జడ్జి హరమోహన్ దాస్ తదితరులు పాల్గొన్నారు.


