హిరమండలం: వంశధార ఎత్తిపోతల పథకం నిర్మా ణం వేగవంతంగా జరుగుతున్నట్టు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఆయన శుక్రవారం వంశధార ఫేజ్–2 రిజర్వాయర్‌తో పాటు ఎత్తిపోత ల పథకం నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని అక్కడి అధికారుల తో పాటు కాంట్రాక్టర్ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత కొద్దిరోజులుగా ప్రాధాన్య తా ప్రాజెక్టుగా తీసుకొని ఎప్పటికప్పుడు వంశధార ఫేజ్–2 రిజర్వాయర్, ఎత్తిపోతల పథకం నిర్మాణ పనుల గురించి సమీక్షిస్తున్నట్టు తెలిపారు. వచ్చే వర్షాకాలంలో ట్యాంకుల అమరిక, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన పనులు పూర్తిచేస్తామని చెప్పారు. సబ్‌స్టేషన్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం నుంచి నగదును ట్రాన్స్‌కోకు చెల్లించినట్టు తెలిపారు. ఇప్పటివరకూ 55 శాతం పనులు పూర్తయ్యా యన్నారు. మిగతా పనులు వీలైనంత త్వరగా పూర్తిచేస్తామని చెప్పారు. ఈ విషయంలో అన్ని శాఖలు సమన్వ యంతో పనిచేయాలని ఆదేశించారు. హిరమండ లం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక ఉన్నట్టు కలెక్టర్ తెలిపారు.


