పర్లాకిమిడి: స్థానిక ఆదర్శ పోలీస్‌స్టేషన్‌లో సైబర్ అపరాధం, ఫైనాన్స్ మోసాలపై నూతన కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం సాయంత్రం వర్చువల్‌గా ప్రారంభించారు. ఎమ్మెల్యే దాశరథి గొమాంగో శిలాఫలకాన్ని ప్రారంభించారు. జిల్లాలో ఎలాంటి సైబర్ మోసాలైనా పర్లాకిమిడి ఆదర్శ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకోవచ్చని ఎస్పీ జ్యోతింద్ర పండా అన్నారు. కార్యక్రమంలో మోహన ఎమ్మెల్యే దాశరథి గోమాంగో, ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, ఎస్పీ జ్యోతింద్ర పండా, డీఎఫ్‌ఓ కె.నాగరాజు, అదనపు ఎస్పీ సునీల్‌కుమార్ మహంతి, సబ్ డివిజనల్ పోలీసు అధికారి అమితాబ్ పండా, జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్ మహాంతి, బార్ అసోసియేషన్, డీఈఓ డాక్టర్ మయాధర్ సాహు, సైబర్ క్రైం ఆదనపు ఎస్పీ సరితా బోహెరియా, మోడల్ పోలీసుస్టేషన్ ఐఐసి ప్రశాంత భూపతి కాశీనగర్ సమితి అధ్యక్షురాలు బల్ల శాయమ్మ, పురపాలక సంఘం చెర్మన్ నిర్మలా శెఠి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.


