శనివారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శనివారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2026

Mar 7 2026 9:29 AM | Updated on Mar 7 2026 9:29 AM

న్యూస్‌రీల్‌

కలెక్టర్‌ కార్యాలయంలో గ్రీష్మతాపం, వడదెబ్బల నివారణ చర్యల సమావేశంలో కలెక్టర్‌, ఇతర అధికారులు

వడదెబ్బల నివారణపై..

సన్నాహాక సమావేశం

పర్లాకిమిడి:

స్థానిక కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లాస్థాయి గ్రీష్మతాపం, వడదెబ్బలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సన్నాహాక సమావేశం కలెక్టర్‌ అక్షయసునీల్‌ అగర్వాల్‌ అధ్యక్షతన జరిగినది. మార్చి మాసం నుంచి జూన్‌ వరకూ గజపతి జిల్లాలో వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని ఐఎండీ హెచ్చరికల దృష్ట్యా ప్రభుత్వ శాఖలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కలెక్టర్‌ సమావేశంలో వివరించారు. వడదెబ్బల నివారణకు పట్టణంలో పురపాలక సంఘం తాగునీటి సమస్య అధిగమించటం, విద్యుత్‌ అప్రకటిత కట్‌ నివారణ, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు ఉదయపు బడులు నిర్వహించడం, అలాగే జంగిల్‌ సురక్ష, కార్మికుల పనివేళలు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటలు, తర్వాత సాయంత్రం నిర్వహణపై జిల్లా కార్మికశాఖకు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్‌ 1 నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు ఒంటిపూట బడులు తెరవాలని కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వడదెబ్బల ఆహుతులకు ప్రత్యేక వార్డు కేటాయించాలని కూడా కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో ఏడీఎం మునీంద్ర హానగ, సబ్‌ కలెక్టర్‌ అనుప్‌పండా, ఐటీడీఏ పీఓ అంశుమాన్‌ మహాపాత్రో, జిల్లా ఎమర్జెన్సీ అధికారి బినాయక్‌ రవుళో తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement