● జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్ సరోజిని దేవి
రాయగడ: గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలు పట్టణ ప్రాంతాల వరకు ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడంలో ఆశ, అంగన్‌వాడీ, ఆరోగ్య కార్తకర్తల సేవలు ప్రశంసనీయమని జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్ సరోజినిదేవి అన్నారు. స్థానిక బిజూపట్నాయక్ ఆడిటోరియంలో శుక్రవారం ఆరోగ్య, ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తల వార్షిక సమావేశంలో ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంతోపాటు ప్రభుత్వ పథకాలు ప్రజల దరికిచేరే విషయంలో ఆశ, అంగన్‌వాడీ, ఆరోగ్య కార్యకర్తల సేవలు ఎంతో విలువైనవని అన్నారు. అందుబాటులో ఉన్న ఆరోగ్య సేవలను ప్రజలకు అందించడంలో వారి పాత్ర చాలా కీలకమన్నారు. అనంతరం వారి సేవలను ప్రశంసిస్తూ ఉత్తమ సేవలను అందించిన వారిని సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ప్రజారోగ్య శాఖ (కుటంబ నియంత్రణ)అధికారి డాక్టర్ కిశోర్‌కుమార్ రాయ్, డాక్టర్ శ్యామ్ చరణ్ గురు, డాక్టర్ మమత చౌదరి, డాక్టర్ ప్రదీప్ కుమార్ సుబుద్ధి పాల్గొన్నారు.


