ఈ నెలాఖరుకు నక్సలిజం అంతం: అమిత్‌ షా | - | Sakshi
Sakshi News home page

ఈ నెలాఖరుకు నక్సలిజం అంతం: అమిత్‌ షా

Mar 7 2026 7:31 AM | Updated on Mar 7 2026 7:31 AM

ఈ నెలాఖరుకు నక్సలిజం అంతం: అమిత్‌ షా

భువనేశ్వర్‌:

ఏడాది మార్చి 31 నాటికి భారతదేశం నక్సలిజం నుంచి విముక్తి పొందుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. ఈ మేరకు ఆయన సభాముఖంగా హామీ ఇస్తున్నానని వక్కాణించారు. దేశం నుంచి నక్సలిజాన్ని నిర్మూ లించాలనే సంకల్పాన్ని భద్రతా దళాలు నెరవేరుస్తా యని అమిత్‌ షా శుక్రవారం పునరుద్ఘాటించారు. కటక్‌లో జరిగిన కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్‌) 57వ వ్యవస్థాపక దినోత్సవంలో అమిత్‌ షా మాట్లాడుతూ, నక్సలిజాన్ని నిర్మూలించడంలో సీఐఎస్‌ఎఫ్‌ కీలక పాత్రను వివరించారు. చేశారు. దేశాన్ని నక్సలిజం నుండి విముక్తి చేయాల ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఆ ప్రయత్నంలో సీఐఎస్‌ఎఫ్‌ కీలక పాత్ర పోషిస్తుంది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ లేదా తెలంగాణలో నక్సలిజాన్ని నిర్మూలించడంలో సీఐఎస్‌ఎఫ్‌ కీలక పాత్రధారిగా అవతరిస్తుంది. తిరుప తి నుండి పశుపతి వరకు రెడ్‌ కారిడార్‌ కావాలని కలలు కనే వారిని భారత భద్రతా దళాలు పూర్తిగా ఓడించి తమ ఆధిపత్యాన్ని స్థాపించుకుంటాయని హోంశాఖ మంత్రి బలమైన నమ్మకం వ్యక్తం చేశారు. దేశం కోసం సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది ‘శౌర్యం, ఆత్మబలిదానాలను‘ ప్రశంసిస్తూ అమిత్‌ షా వారి సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. 56 సంవత్సరాల్లో సీఐఎస్‌ఎఫ్‌ ఆశయ సాధనతో అన్ని రకాల సవాళ్ల ను ఎదుర్కోవడం ద్వారా తనను తాను ధీటుగా మలచుకుందని కొనియాడారు. శౌర్యం, త్యాగం భారత దేశ అద్భుతమైన చరిత్రకు ముఖ్య లక్షణా లు. ఈ లక్షణాలను అంకిత భావంతో, ఆధునిక ఆయుధాలతో మిళితం చేయడం ద్వారా సీఐఎస్‌ఎఫ్‌ అన్నిరకాల సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రదర్శించింది. కటక్‌ ప్రాంతం ముండలిలోని ఖారవేళ ప్రాంతీయ శిక్షణా కేంద్రంలో జరిగిన కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్‌) 57వ వ్యవస్థాపక దినోత్సవానికి హాజరైన సందర్భంగా ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో పలు కార్యక్రమాలలో పాల్గొనడానికి రాష్ట్రానికి విచ్చేసిన కేంద్ర హోం మంత్రిని ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ స్థానిక బిజూ పట్నాయక్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాగతించారు.

భువనేశ్వర్‌లోని నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ (ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ) క్యాంపస్‌ పక్కన ఉన్న సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీ (సీఎఫ్‌ఎస్‌ఎల్‌) భూమి పూజలో కేంద్ర మంత్రి అమిత్‌ షా పాల్గొన్నారు. మరో కార్యక్రమంలో భాగంగా న్యూ న్యాయ సంహితపై ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జెండా ఊపి మొబైల్‌ ఫోరెన్సిక్‌ వ్యాన్‌ ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement