కన్యాకుమారి ట్రైన్‌లో మంటలు | - | Sakshi
Sakshi News home page

కన్యాకుమారి ట్రైన్‌లో మంటలు

Jul 12 2023 8:22 AM | Updated on Jul 12 2023 8:29 AM

- - Sakshi

బరంపురం: గంజాం జిల్లా బరంపురం దగ్గర కన్యాకుమారి నుంచి పశ్చిమ బెంగాల్‌ వేళ్లే సూపర్‌ ఫాస్ట్‌ రైలులో మంటలు చెలరేగాయి. ఈస్ట్‌–కోస్ట్‌ రైల్వే అధికారులు మరియు బరంపురం సబ్‌ కలెక్టర్‌ అశుతోష్‌ కులకర్ణి తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం మధ్యాహ్నం కన్యాకుమారి నుంచి పశ్చిమ బెంగాల్‌ వెళ్తున్న సూపర్‌ ఫాస్ట్‌ రైలు 10వ నంబర్‌ బోగీలో హటాత్తుగా మంటలు వచ్చాయి.

అయితే ఆ సమయంలో లోకో ఫైలెట్‌ అప్రమత్తమై బండిని వెంటనే స్టేషన్‌ ఔటర్‌లో నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని ప్రయాణికులను దించి, మంటలను అదుపు చేశారు. అనంతరం బండి యథావిధిగా బయల్దేరింది. ఈ ఘటనతో పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి.

1
1/1

Advertisement
 
Advertisement
Advertisement