పెన్షన్‌ వాలిడేషన్‌ బిల్లును రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

పెన్షన్‌ వాలిడేషన్‌ బిల్లును రద్దు చేయాలి

Aug 9 2026 2:40 AM | Updated on Aug 9 2026 2:40 AM

పెన్షన్‌ వాలిడేషన్‌ బిల్లును రద్దు చేయాలి

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): కేంద్ర ప్రభుత్వం పెన్షన్‌ వాలిడేషన్‌ బిల్లును వెంటనే రద్దు చేయాలని పెన్షన ర్లు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు నగరంలో హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో బొడ్డేపల్లి జనార్ధనరావు అధ్యక్షతన ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ శ్రీకాకుళం జిల్లా శాఖ కార్యవర్గ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ ప్రధాన కార్యద ర్శి మణికొండ ఆదినారాయణమూర్తి మాట్లాడుతూ .. ఈపీఎస్‌ పెన్షనర్లకు కనీస పెన్షన్‌ రూ.9 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులు, కార్మికు లు దాచుకున్న సుమారు రూ.13 లక్షల కోట్ల ఈపీఎఫ్‌ ఫండ్‌ను కార్పొరేట్‌ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం దారాదత్తం చేస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభు త్వం వెంటనే 12వ పీఆర్సీని నియమించి, 30 శాతం ఐఆర్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షుడు దొంతం పార్వతీశం, కోశాధికారి పి.సుధాకర్‌, ఉపాధ్యక్షుడు బి.నర సింహరావు, కార్యదర్శులు కె.చంద్రశేఖరరావు, బి. సూర్యనారాయణ, బి.లక్ష్మణరావు, ఎల్‌.అనంతరా వు, సీహెచ్‌ శ్రీనివాసరావు, సీహెచ్‌ సూర్యనారాయ ణ, బి.సూర్యరావు, పి.సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement