నరసన్నపేట: జిల్లాస్థాయి యోగా పోటీలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. స్థానిక ప్రైవేటు కల్యాణ మండపంలో జిల్లాస్థాయి యోగాసన చాంపియన్–2026 ఐదో క్రీడా పోటీలు శనివారం యోగాసన స్పోర్ట్ అసో సియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ట్రెడిషన్ యోగా, ఆర్టిస్పిక్ యోగా, రిథమిక్ యోగా అంశాల్లో ఆరు విభాగాల్లో పోటీలు జరిగాయి. మొత్తం 310 మంది పోటీల్లో పాల్గొనగా ఒక్కో విభాగం నుంచి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన క్రీడాకారులకు మెడల్స్, ధ్రువపత్రాలు అందజేశారు. ఇక్కడ గెలుపొందినవారు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో నేషనల్ యోగా స్పోర్ట్ ఫెడరేషన్ (ఎన్‌వైఎస్‌ఎఫ్) ప్రతినిధి తంగి స్వాతి, కార్యదర్శి కేదారినాథ్, పతంజిలి యోగా రాష్ట్ర అధ్యక్షుడు దంపల చిన్నబాబు, వివేకనంద ధ్యాన యోగా సమితి అధ్యక్షుడు కింజరాపు రామారావు, యోగా గురువులు సదాశివుని రవి, వండాన సుప్రజ, మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.


