Sufiya Sufi: 88 రోజులు.. 5 వేల కిలోమీటర్లు | Sufiya Sufi Monumental Run 5000KM-88 Days Target Tribute-Armed Forces | Sakshi
Sakshi News home page

Sufiya Sufi: 88 రోజులు.. 5 వేల కిలోమీటర్లు

May 13 2026 1:32 PM | Updated on May 13 2026 1:45 PM

Sufiya Sufi Monumental Run 5000KM-88 Days Target Tribute-Armed Forces

రాజస్థాన్‌కు చెందిన అల్ట్రా-మారథాన్ రన్నర్ సూఫియా సుఫీ త‌న సాహ‌సయాత్ర‌ను ప్రారంభించింది. భార‌త సాయుధ ద‌ళాల‌కు నివాళిగా క‌న్య‌కుమారి నుంచి కార‌కోరం వ‌ర‌కు 5వేల కిలోమీట‌ర్లు రన్నింగ్ చేయనుంది. అయితే అత్యంత క‌ఠిన‌మైన ఈ యాత్ర‌ను పూర్తి చేయ‌డానికి సుఫియా సుఫీకి 88 రోజులు ప‌ట్ట‌నుంది. 

ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం త‌న యాత్ర‌ను ప్రారంభించిన సూఫియా తొలి రోజు 52 కిలోమీట‌ర్ల దూరం పరిగెత్తిన వీడియోనూ ఎక్స్‌లో పంచుకుంది. బుధ‌వారం మ‌రో 52 కిలోమీట‌ర్లు ప‌రిగెత్త‌నున్న‌ట్లు తెలిపింది. తొలిరోజు 12 గంట‌ల 23 నిమిషాల పాటు ప‌రిగెత్తి 52 కిలోమీట‌ర్లు పూర్తి చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

దక్షిణ భారత్ ఏరియా ప్రధాన కార్యాలయం మద్దతుతో ఈ మ‌హ‌త్త‌ర కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన సోఫి త‌న ప్ర‌యాణంలో అన్ని ప్ర‌ధాన యుద్ధ స్మార‌క చిహ్నాల‌ను గౌర‌వించ‌నున్న‌ట్లు తెలిపింది. ల‌డ‌ఖ్‌లోని కార్గిల్ దివస్ వ‌ద్ద త‌న సాహ‌స‌యాత్ర ముగించ‌నున్న‌ట్లు ఆమె పేర్కొంది. ఈ ఘనత సూఫియా అకుంఠిత స్ఫూర్తికి నిదర్శనంగా నిల‌వ‌నుంది. 

జాతీయ ఐక్యత, దేశభక్తి, పట్టుదలకు ప్రతీకగా నిలిచే ఈ ప్రయాణానికి నాంది పలుకుతూ, కల్నల్ సూర్య ముఖర్జీ ఈ మారథాన్‌ను అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు. తన ఆరో గిన్నిస్ ప్రపంచ రికార్డు కోసం కృషి చేస్తున్న సూఫియా అంకితభావానికి, మానసిక స్థైర్యానికి ఈ పరుగు ఒక నిదర్శనం అని చెప్పొచ్చు.

చదవండి: సాయి సుదర్శన్‌ అరుదైన ఫీట్‌!

Advertisement
 
Advertisement
Advertisement