శుభకార్యానికి వెళ్లి వస్తుండగా.. | - | Sakshi
Sakshi News home page

శుభకార్యానికి వెళ్లి వస్తుండగా..

May 12 2023 12:36 AM | Updated on May 25 2026 12:58 PM

-

● ఆటోను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం ● ఇద్దరు మహిళలు మృతి ● మరో ఇద్దరికి గాయాలు 
 

టెక్కలి రూరల్‌(కోటబొమ్మాళి): కోటబొమ్మాళి మండలం వాండ్రాడ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తులసిపేట కాలనీకి చెందిన కిర్రు నాగమణి(32), జలుమూరు మండ లం పెద్ద దూగాం గ్రామానికి చెందిన కె.రాములమ్మ (60), నైరా గ్రామానికి చెందిన కె.అశోక్‌లు గురువా రం కోటబొమ్మాళి మండలం నిమ్మాడ పంచాయతీ రాజపురంలో జరిగిన ఓ వివాహ వేడుకకు వెలమపేటకు చెందిన కె.చిన్నబాబు ఆటోలో కలిసి వెళ్లారు. కార్యక్రమం అనంతరం తిరిగి వస్తుండగా వాండ్రాడ సమీపంలోకి వచ్చే సరికి గుర్తుతెలియని వాహనం వీరి ఆటోను అతివేగంగా వచ్చి ఢీకొని వెళ్లిపోయింది. ఆటో రెండుసార్లు పల్టీలు కొట్టడంతో నాగమణి అక్కడికక్కడే మృతి చెందింది. రాములమ్మతో పాటు అశోక్‌, చిన్నబాబులకు తీవ్ర గాయాలయ్యా యి. గాయపడిన ముగ్గురిని 108 వాహనంలో నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా ఆసుప త్రి సమీపంలో రాములమ్మ మృతిచెందింది. మిగిలి న ఇద్దరు తీవ్రగాయాలతో చికిత్స పోందుతున్నారు. ఈ ఘటనలో మృతిచెందిన నాగమణి భర్తతో విడాకులు తీసుకుని ఇద్దరు చిన్న కుమార్తెలతో ఒంటరిగా ఉంటోంది. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ తరుణంలో నాగమణి మృతి చెంద డంతో పిల్లలు అనాథలుగా మారారు. ఈ ఘటనపై కోటబొమ్మాళి ఎస్‌ఐ షేక్‌మహ్మద్‌ అలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement