● మొత్తం 11 కార్యకలాపాలకు గుర్తింపు ● గని ద్వారా ఏడాదికి 85 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం
రాయగడ:
జిల్లాలోని హిండాల్కో ఇండస్ట్రీస్‌కు చెందిన బప్లిమాలి బాకై ్సట్ గని అరుదైన ఘనత సాధించింది. ఆదిత్యా బిర్లా గ్రూపునకు చెందిన ఉత్కళ్ అలూమిన ఇంటర్నేషనల్ లిమిటెడ్ నిర్వహిస్తున్న బప్లిమాలి బాకై ్సట్ గనికి అల్యూమినియం స్టీవార్డ్ షిప్ ఇనిషియేటీవ్ (ఏఎస్‌ఐ) పెర్పార్మెన్స్ స్టాండర్డ్ వి3.1 (2023) ధ్రువీకరణ లభించింది. దీంతో ఈ ప్రమాణాన్ని పొందిన భారత్‌లో తొలి బాకై ్సట్ మైనింగ్ ఆపరేషన్‌గా బప్లిమాలి నిలిచింది. ఈ ఏఎస్‌ఐ ధ్రువీకరణ బప్లిమాలి గనిలో ప్రణాళిక, మైనింగ్ కార్యకలాపాలు, గనిలోనే బాకై ్సట్ క్రషింగ్, గని నుంచి కన్వేయర్ ద్వారా బాకై ్సట్ రవాణా వంటి కార్యకలాపాలను పరిశీలించారు. బప్లిమాలి గనికి సంవత్సరానికి 85 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఇక్కడ లభించే బాకై ్సట్ ఉత్కల్ అలూమిన రిఫైనరీకి సరఫరా అవుతూ హిండాల్కో సమగ్ర అల్యూమినియం విలు శృంఖలిలో కీలక భాగంగా ఉంది. ఈ తాజా గుర్తింపుతో హిండాల్కోకు చెందిన మొత్తం 11 కార్యకలాపాలు ఏఎస్‌ఐ ధ్రువీకరణ పొందాయి. ఇందులో మైనింగ్, స్మెల్డింగ్, డౌన్‌స్ట్రీమ్ ఉత్పత్తి విభాగాలకు చెందిన కార్యకలాపాలు ఉన్నాయి. మౌడా, హీకాకుడ్ ఎఫ్‌ఆర్‌పీ, తలొజ, కుప్పం, అలుపురం, కల్లూరు, రేణుకుట్, బలగావి, హిరాకుడ్, ఆదిత్య తదితర ప్రాంతాల్లోని హిండాల్కొ కార్యకలాపాలు ఈ ధ్రువీకృత శ్రేణిలో ఉన్నాయి. హిండాల్కొ ఇండస్ట్రీస్ అల్యూమినియం ఆప్‌స్ట్రీమ్ సీఈవో కై లాస్ పాండే మాట్లాడుతూ.. బప్లిమాలి తమ సమగ్ర అల్యూమినియం విలువ శృంఖలిలో కీలకమైన ఆస్తి అని పేర్కొన్నారు. ఏఎస్‌ఐ ధ్రువీకరణ ద్వారా స్థిరత్వం, పారదర్శకత, బాధ్యతాయుతమైన వనరుల వినియోగంపై సంస్థకు ఉన్న నిబద్దత మరింత స్పష్టమవుతుందని పేర్కొన్నారు. మైనింగ్ నుంచి లోహం వరకు బాధ్యతాయుతమైన అల్యూమినియం విలువ శృంఖలిని మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఏఎస్‌ఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ ఫియానా సొలమాన్ మాట్లాడుతూ బప్లిమాలి బాకై ్సజ్ గనికి లభించిన ధ్రువీకరణ ఉత్కల్ అలూమినా, హిండాల్కొ సంస్థలు స్థిరమైన ప్రమాణాల అమలుపై చూపుతున్న నిరంతర నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. పర్యావరణ, సామాజిక, పాలనాపరమైన విధానాలను అమలు చేయడంతో పాటు బాధ్యతాయుతమైన ఉత్పత్తిని ప్రోత్సాహించేందుకు హిండాల్కొ చేస్తున్న కృషిని ఇది ప్రతిబింబిస్తుందని అభిప్రాయపడ్డారు.


