బస్సు ఢీకొని రెండు మేకలు మృతి | - | Sakshi
Sakshi News home page

బస్సు ఢీకొని రెండు మేకలు మృతి

Aug 14 2026 8:02 AM | Updated on Aug 14 2026 8:02 AM

రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్‌ సమితి నారాయణపూర్‌ పంచాయతీ సీతాపూర్‌–నారాయణపూర్‌ శివాలయం సమీపంలో వంతెన వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలొ రెండు మేకలు మృతి చెందాయి. మరో 8 పశువులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు.. నారాయణపూర్‌ పంచాయతీ భాతపరషి గ్రామానికి చెందిన లచ్చంపతి కడ్రక తన ఆవులు, ఎద్దులు, మేకలను మేత కోసం రోడ్డు అవతలి వైపుకు తీసుకువెళ్తున్న సమయంలో రాయగడ నుంచి కళ్యాణసింగుపూర్‌ వైపు వెళుతున్న బస్సు బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో అదుపుతప్పి పశువులను ఢీకొట్టింది. రెండు మేకలు అక్కడికక్కడే మృతి చెందగా మరో 8 పశువులు తీవ్రగాయాలకు గురయ్యాయి. సమాచారం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బస్సును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నష్టపరిహారం చెల్లించేందుకు యజమాని అంగీకరించడంతో బస్సును తిరిగి వదిలేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement