పర్లాకిమిడి: సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్‌లో శనివారం ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ విభాగం ఆధ్వర్యంలో అడ్వాన్స్‌డ్ యాంటెన్నా డిజైన్, సిమ్యులేషన్ వాడకంతో హెచ్‌ఎఫ్‌ఎస్‌ఎస్ అండ్ సీఎస్‌టీ మూడు రోజుల వర్క్‌షాపును డా.ప్రభాత్ కుమార్ పట్నాయిక్ ప్రారంభించారు. సెంటర్ ఫర్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆర్‌సీ కో–ఆర్డినేటర్ డా.అభినాష్ గయా పాల్గొని మాట్లాడారు. అధునాతన కమ్యూనికేషన్ వ్యవస్థ లో సిమ్యులేషన్ ఆధారిత అభ్యాసం, ఆధునాతన యాంటెన్నా టెక్నాలజీల ప్రాముఖ్యతను ఆయన వివరించారు. వర్క్‌షాపులో వీవీడీఎన్ టెక్నాలజీస్ (భువనేశ్వర్)కు చెందిన టెక్ లీడ్ డా.ప్రియా రంజన్ మెహరా కూడా మాట్లాడారు. వర్క్‌షాపు ముగింపులో కో–ఆర్డినేటరు డా.రిభూ అభిషన్ పండా అతిథులకు ధన్యవాదాలు తెలిపారు.


