● రైల్వే ప్లాట్‌ఫాంపై ప్రసవం | - | Sakshi
Sakshi News home page

● రైల్వే ప్లాట్‌ఫాంపై ప్రసవం

Oct 4 2026 5:23 PM | Updated on Oct 4 2026 5:23 PM

భువనేశ్వర్‌: స్థానిక రైల్వేస్టేషన్‌ 4వ నంబర్‌ ప్లాట్‌ఫాంపై బంగిరిపొషి – పూరీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణిస్తున్న గర్భిణి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రయాణం మధ్యలో ఆమె ప్రసవ వేదనకు గురయ్యింది. భువనేశ్వర్‌ స్టేషన్‌కు రైలు చేరుకోగానే సత్వర చర్యలు చేపట్టేందుకు రైల్వే రక్షక దళం (ఆర్‌పీఎఫ్‌) సిబ్బంది, మేరీ సహేలి బృందం సభ్యులు హాజరయ్యారు. ఆమె తీవ్రమైన ప్రసవ నొప్పులతో బాధపడుతున్నట్లు గమనించి హుటాహుటిన ఆదుకున్నారు. సమయస్ఫూర్తితో స్పందించి మహిళలతో కూడిన మేరీ సహేలీ బృందం, ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది గోప్యత, గౌరవాన్ని కాపాడటానికి ప్లాట్‌ఫాంపైనే తాత్కాలిక ఆవరణను ఏర్పాటు చేశారు. వారి మద్దతుతో, వైద్య సహాయం అందేలోపే ఆ మహిళ ప్లాట్‌ఫాంపైనే ఆరోగ్యవంతమైన ఆడబిడ్డకు సురక్షితంగా జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని సమాచారం. వారిని తదుపరి వైద్య సంరక్షణ కోసం తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement