కొరాపుట్: పిడుగు పాటు సమయంలో మొబైల్ వినియోగిస్తున్న యువకుడు మృతి చెందాడు. గురువారం కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి కొసంది పంచాయతీ దారింగిబా గ్రామంలో జగన్నాథ సిసా కుమారుడు భాగీరథి సిసా (16) మృతి చెందాడు. ఇంట్లో సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెట్టి చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకుని భాగీరథి పాటలు వింటున్నాడు. ఇదే సమయంలో భారీ వర్షంతో పాటు పిడుగులు ఆ ప్రాంతంలో పడ్డాయి. వెంటనే యువకుడు పెద్ద కేక వేసి కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో నందపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు.


