ఇంటింటా మువ్వన్నెల జెండా (హర్ ఘర్ తిరంగా) కార్యక్రమం కోసం మొత్తం 60 లక్షల జాతీయ జెండాలు సిద్ధం అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ శక్తి స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జీలు) నిర్ణీత గడువులోగా ఈ జెండాలను విజయవంతంగా సిద్ధం చేయడం విశేషం. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని 30 జిల్లాల నుంచి 1,235 ఎస్‌హెచ్‌జీలు, 201 ఉత్పత్తిదారుల బృందాలు, 138 సమాఖ్యల నుంచి 16,162 మంది ఎస్‌హెచ్‌జీ సభ్యులు చురుగ్గా పాల్గొన్నారు. రాష్ట్రంలో హర్ ఘర్ త్రివర్ణ– 2026 వేడుకల కోసం 60 లక్షల జాతీయ పతాకాల లక్ష్యాన్ని వంద శాతం విజయవంతంగా పూర్తి చేయడం దేశ నిర్మాణం, మహిళా నేతృత్వంలో అభివృద్ధి పట్ల ఒడిశా మిషన్ శక్తి మహిళల నిబద్ధతను చాటి చెబుతోంది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా అభినందించారు.
– భువనేశ్వర్


