గన్నవరం: యూట్యూబర్ ప్రశ్న రావణ్‌ను కస్టడీ కోరుతూ కోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌ను పోలీసులు ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు గన్నవరం కోర్టులో మంగళవారం కస్టడీ పిటీషన్‌పై జరిగిన విచారణ సమయంలో పిటీషన్ ఉపసంహరించుకున్నట్లు ఏపీపీ కోర్టుకు తెలిపారు. గన్నవరం పోలీసులు రాజద్రోహం తదితర సెక్షన్ల కింద నమోదు చేసిన కేసులో ఈనెల 4న అరెస్టయిన రావణ్ నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో తదుపరి విచారణ నిమిత్తం రావణ్‌ను పది రోజుల పోలీస్ కస్టడీ కోరుతూ స్థానిక ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈనెల 10న పిటీషన్ విచారణకు ప్రాసిక్యూషన్ తరఫున న్యాయవాదులు హాజరుకాకపోవడంతో 14కి విచారణను కోర్టు వాయిదా వేసింది. ఈక్రమంలో మంగళవారం జరిగిన విచారణకు రావణ్ తరఫున వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, సుదర్శనరెడ్డి హాజరయ్యారు. అయితే కస్టడీ ిపిటీషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లుగా పోలీసుల తరఫున ఏపీపీ మాధవి కోర్టుకు తెలిపారు. ఈ పిటీషన్‌లో లోపాలను సవరించి తిరిగి కొత్తగా మరో కస్టడీ పిటీషన్ ను పోలీసులు దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.


