అమెరికా నాసా ఎన్‌ఎస్‌ఎస్‌ ఐఎస్‌డీసిలో సత్తా చాటిన విద్యార్థులు | Students talent at NASA NSS ISDC in America | Sakshi
Sakshi News home page

అమెరికా నాసా ఎన్‌ఎస్‌ఎస్‌ ఐఎస్‌డీసిలో సత్తా చాటిన విద్యార్థులు

Jul 19 2025 2:50 PM | Updated on Jul 19 2025 2:53 PM

Students talent at NASA NSS ISDC in America

బంజారాహిల్స్‌: అంతర్జాతీయ స్థాయిలో అమెరికా నాసా ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్‌ నిర్వహించిన ఐఎస్‌డీఎస్‌ కాన్ఫరెన్స్‌లో శ్రీ చైతన్య స్కూల్‌ విద్యార్థులు సత్తా చాటారని శ్రీ చైతన్య స్కూల్‌ అకడమిక్‌ డైరెక్టర్‌ సీమ తెలిపారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌లో నాసా  ఏర్పాటు చేసిన ఐఎస్‌డీఎస్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 దేశాల నుంచి 475 మంది విద్యార్థులు హాజరైతే అందులో 67 మంది భారత దేశం నుంచి పాల్గొనగా 45 మంది శ్రీ చైతన్య స్కూల్‌ విద్యార్థులే ఉండటం తమకు గర్వకారణంగా ఉందని అన్నారు. అమెరికా నాసా ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్‌ నిర్వహించిన స్పేస్‌ సెటిల్‌మెంట్‌ కాంటెస్ట్‌లో అంతర్జాతీయ స్థాయిలో 60 విన్నింగ్‌ ప్రాజెక్టులు గెలుచుకొని తాము వరల్డ్‌ నెం1.గా నిలిచామని తెలిపారు. వీటిలో వరల్డ్‌ ఫస్ట్‌ ప్రైజ్‌ 3 ప్రాజెక్టులు, వరల్డ్‌ సెకండ్‌ ప్రైజ్‌ 4 ప్రాజెక్టులు, వరల్డ్‌లో మూడో ప్రైజ్‌ కింద 10 ప్రాజెక్టులు గెలుచు కోవడంతో పాటు 43 ప్రాజెక్టులకు హానరబుల్‌ మెన్షన్స్‌ సాధించాయని తెలిపారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల నుంచి మరే ఏ ఇతర పాఠశాల నుంచి విద్యార్థులు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొనలేదన్నారు.ఈ కాన్ఫరెన్స్‌లో ఆర్టిస్టిక్‌ కేటగరిలో 500 డాలర్ల బహుమతి అందుకున్న ఏకైక టీం తమదేనని ఆమె వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement