సింగపూర్‌లో తమిళ భాష వైభవం.. ప్రోత్సహిస్తున్న ఆ దేశ మంత్రి! | Sakshi
Sakshi News home page

సింగపూర్‌లో తమిళ భాష వైభవం.. ప్రోత్సహిస్తున్న ఆ దేశ మంత్రి!

Published Fri, Apr 5 2024 5:16 PM

Singapore Ministers Pitch To Introduce Children To Tamil Language - Sakshi

పరాయి దేశాల్లో మన భాషకు ప్రాముఖ్యత ఇస్తే ఎంతో గర్వంగా ఉంటుంది. అక్కడ విద్యా విధానంలో మన భాషలకు ప్రాధాన్యం ఇస్తే.. ప్రతి భారతీయ పౌరుడిగా సగర్వంగా అనిపిస్తుంది. సింగపూర్‌ దేశంలో అలాంటి అద్భుత సన్నివేశమే చోటు చేసుకుంది. సాక్షాత్తు ఆ దేశ మంత్రి అందుకు నడుబిగిస్తే అది మాములు విషయం కాదు కదా. 

ఏం జరిగిందంటే..సింగపూర్‌లో భారత సంతతికి చెందిన మంత్రి ఇంద్రాణి రాజా తమిళ భాష ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. సంపన్న నగర రాష్ట్రంలో నాలుగు అధికారిక భాషల్లో ఒక దానిని చిన్నారులకు పరిచయం చేయాల్సిన అవసరం గురించి తెలిపారు. అక్కడ సింగపూర్‌ విద్యా విధానం హిందీ, ఉర్దూ, పంజాబీ, వంటి ఇతర ప్రధాన భారతీయ భాషల తోపాటు తమిళం, మలయాళమ్‌, చైనీస్‌(మాండరిన్‌) వంటి భాషలను పాఠశాలల్లో సెకండ్‌ లాగ్వేజ్‌గా ప్రోత్సహిస్తోంది. ఈ మేరకు ఇంద్రాణి రాజా సింగపూర్‌ ప్రధాన మంత్రి కార్యాలయంలో మాట్లాడుతూ..తమిళ భాష ఇక్కడ ఉండే భారతీయ ప్రజలందర్నీ కలిపే పాస్‌పోర్ట్‌గా పనిచేస్తుంది. దాన్ని సజీవంగా ఉంచాల్సిన బాధ్యత మనది కాబట్టి దాన్ని పాఠ్యాంశంగా పిల్లలు నేర్చుకోవాలని అన్నారు.

కేవలం చదువుగానే గాక వాడుకలో కూడా ఆ భాషను వినియోగించాలన్నారు. చిన్నప్పటి నుంచి చిన్నారులు మాతృభాషను ఉపయోగిస్తున్నంత కాలం ఏ భాష అయిన సజీవంగానే ఉంటుందన్నారు. అంతేగాదు సింగపూర్‌లో తమిళ భాషా వారసత్వాన్ని నిలబెట్టేందుకు తమిళ భాషా మండలి(టీఎల్‌సీ) గత 18 ఏళ్లుగా తమిళ భాషా ఉత్సావాన్ని(టీఎల్‌ఎఫ్‌) నిర్వహిస్తోంది. గత శనివారమే ఈ టీఎల్‌ఎఫ్‌ని ప్రారంభించారు. ప్రతి తరం వారి మాతృభాషతో అనుసంధానింపబడి ఉండాలని అదే  వారసత్వ సాంస్కృతిక గుర్తింపు అని దాని ప్రాముఖ్యత గురించి చెప్పుకొచ్చారు. 'క్యాపబిల్టీస్‌' అనే పేరుతో ఈ ఏడాది టీఎల్‌సీ సింగపూర్‌లో ఈ తమిళ భాషా ఉత్సవాన్ని మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 28 వరకు జరుపుతోంది.

ఈ వేడుకల్లో మొత్తం 47 ఈవెంట్‌లు నిర్వహించనున్నారు. ఇలా సింగపూర్‌లో భారత సంతతి తమిళులు సాముహికంగా వినూత్న కార్యక్రమాలు రూపొందించడానికి ఈ ఏడాది థీమ్‌ను కూడా ఎంచుకున్నట్లు టీఎల్‌సీ చైర్‌పర్సన్‌ ఎస్‌ మనోగరన్‌ అన్నారు. ఈ కార్యక్రమాల్లో సుమారు 65%కి పైగా ఎక్కువ ఈవెంట్‌లు యువకులచే నిర్వహించనున్నారు. కళ, సంస్కృతి, సాహిత్య కార్యక్రమాల ద్వారా యువతకు తమిళ భాషను చేరువ చేయనున్నట్లు పేర్కొన్నారు. యువతను లక్ష్యంగా  చేసుకుని ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశామని, వీటి ద్వారా అయినా తమిళ భాషను నేర్చుకోవడం వల్లే కలిగే ‍ప్రయోజనం తెలుసుకోవాలన్నదే తమ ధ్యేయమని అన్నారు మనోగరన్‌. 

(చదవండి: US: క్రూయిజ్‌ ఎక్కే అదృష్టం కూడా ఉండాలేమో.!)

Advertisement
Advertisement