పౌరసత్వం రద్దయిన వారికి కువైట్‌ గుడ్‌న్యూస్‌ | Kuwait New Residency Tule For Citizenship Loss | Sakshi
Sakshi News home page

పౌరసత్వం రద్దయిన వారికి కువైట్‌ గుడ్‌న్యూస్‌

Sep 8 2026 1:51 AM | Updated on Sep 8 2026 1:51 AM

Kuwait New Residency Tule For Citizenship Loss

కువైట్‌ సిటీ: కువైట్‌లో పౌరసత్వాన్ని కోల్పోయిన వారికి దేశంలో కొనసాగేందుకు కొత్త నివాస అనుమతి నిబంధనను తీసుకురావడానికి ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీంతో పౌరసత్వం రద్దు చేసినా లేదా వెనక్కి తీసుకున్నా, కొన్ని షరతులతో గరిష్ఠంగా 10 సంవత్సరాల వరకు కువైట్‌లో నివసించేందుకు అనుమతి లభించనుంది.

పౌరసత్వం కోల్పోయిన తర్వాత తమ పాత విదేశీ పౌరసత్వాన్ని తిరిగి పొందిన వారు లేదా మరో దేశ పౌరసత్వం పొందిన వారు ఈ కొత్త నిబంధన కింద సాధారణ నివాస అనుమతికి అర్హులవుతారు. అయితే ఈ అనుమతి గరిష్ఠంగా 10 సంవత్సరాల కాలానికి మాత్రమే ఉండనుందని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే, నివాస అనుమతి మంజూరు చేయడం, దాన్ని పునరుద్ధరించడం వంటి అంశాలకు సంబంధించిన నిబంధనలు, నియంత్రణలను రెసిడెన్సీ అఫైర్స్‌ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ నిర్ణయించనున్నారు. ఈ నిబంధనల ప్రకారం నివాస అనుమతి పొందిన వారు కువైట్‌లో ఉద్యోగం చేసేందుకు పాటించాల్సిన నిబంధనలను కూడా అధికారులు నిర్ణయించనున్నారు.

అలాగే, సవరించిన నిబంధనలను అధికారిక గెజిట్‌లో ప్రచురించిన తర్వాత ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. దీంతో పౌరసత్వం కోల్పోయినప్పటికీ ఇతర దేశ పౌరసత్వం పొందిన వారికి కువైట్‌లో చట్టబద్ధంగా నివసించే అవకాశం లభించనుంది.

ఇవి కూడా చదవండి: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. బహ్రెయిన్‌-సౌదీ మధ్య కొత్త సౌకర్యం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement