రష్యా నుంచి పాకిస్తాన్‌లోని కరాచీకి వెళ్తున్న ఓ నౌకపై (ఎంవీ బేరియన్) డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో నౌకలోని సిబ్బంది నివాస ప్రాంతం దెబ్బతినడంతో మంటలు చెలరేగాయి. దాడి సమయంలో నౌకలో 23 మంది భారతీయ నావికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడ్డారని తెలుస్తోంది. నౌక సమీపంలో మరో డ్రోన్ కూడా కనిపించినట్లు సమాచారం.
హోర్ముజ్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తత
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య నౌకల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో నౌకాయానానికి ముప్పు పెరిగింది.
డ్రోన్ దాడులు, నౌకలపై దాడుల ముప్పు, సముద్ర మార్గాల్లో అంతరాయాల కారణంగా అంతర్జాతీయ షిప్పింగ్ సంస్థలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. హర్మూజ్ వద్ద పరిస్థితి మరింత దిగజారితే ప్రపంచవ్యాప్తంగా చమురు, సహజ వాయువు సరఫరాలపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది.
స్పష్టత లేదు
ఎంవీ బేరియన్‌పై జరిగిన డ్రోన్ దాడి హర్మూజ్ జలసంధిలో జరిగిందా, లేక దాని సమీపంలో జరిగిందా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.నౌకపై దాడి జరిగిన ఖచ్చితమైన ప్రదేశాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు.
చదవండి: అమెరికాలో డీజిల్ ధరలు ఆల్‌టైమ్ హై


