బెర్లిన్: జర్మనీలోని మ్యూనిచ్, స్టుట్‌గార్ట్, బెర్లిన్ నగరాల్లో ఈ రోజు సోమవారం దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున వైఎస్సార్ అభిమానులు తరలివచ్చి, ఆయన సేవలను కొనియాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా నేడు తామంతా ఉన్నత స్థాయిలో ఉండగలుగుతున్నామని ఆయన సేవలను స్మరించుకున్నారు.
17వ వర్ధంతి సందర్భంగా మ్యూనిచ్ నగరంలో నిర్వహించిన “YSR Chess Tournament” విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం కృష్ణ తేజ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి కోర్ కమిటీ సభ్యులు నాగార్జున రెడ్డి ఆవుల (జనరల్ సెక్రటరీ), గురు (కో-కన్వీనర్), విష్ణు వర్ధన్ రెడ్డి మార్తల (ఐటీ కోఆర్డినేటర్), Dr. మల్లికార్జున రెడ్డి బండి (మీడియా స్పోకెస్పర్సన్), మనోజ్ కామసాని (మీడియా స్పోకెస్పర్సన్), నవీన్ రెడ్డి కలమకూరి (సోషల్ మీడియా కోఆర్డినేటర్), సాయి సూర్య చౌదరి (ఎగ్జిక్యూటివ్ మెంబర్), మంజునాథ్ రెడ్డి చవ్వాబాలన్న (ఎగ్జిక్యూటివ్ మెంబర్), వినోద్ అమలదాసు (ఎగ్జిక్యూటివ్ మెంబర్), షాలిని అక్షింతల (ఎగ్జిక్యూటివ్ మెంబర్), ఉపేంద్ర జలది, ప్రదీప్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
వైఎస్సార్ సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తమ బాధ్యతని ఈ సందర్భంగా కమిటీ సభ్యులు తెలిపారు.


