గాంధీ జయంతి: అమెరికాలో విజయవంతమైన క్లీన్ మౌంటైన్ హౌస్ ప్రచారం | Clean Mountain House campaign eve of Gandhi Jayanti in usa | Sakshi
Sakshi News home page

గాంధీ జయంతి: అమెరికాలో విజయవంతమైన క్లీన్ మౌంటైన్ హౌస్ ప్రచారం

Oct 4 2024 8:14 PM | Updated on Oct 4 2024 8:25 PM

Clean Mountain House campaign eve of Gandhi Jayanti in usa

మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న  లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ చెందిన ఎల్ఎన్ కుముదాకర్ చిట్టూరి, తణుకు చెందిన సూర్యనారాయణ, ఇండియా ది మౌంటైన్ హౌస్ గ్రూప్‌కు చెందిన టి గోపాల్, పేరెంట్స్‌ గ్రూప్‌ల ఆధ్వర్యంలో అమెరికాలో కమ్యూనిటీ సర్వీస్ ప్రోగ్రామ్‌ను  ఘనంగా నిర్వహించించారు.

ఈ  సందర్భంగా  అమెరికాలో పనిచేస్తున్న భారతీయ సంతతికి చెందిన నైపుణ్యం గల కార్మికుల తల్లిదండ్రులతో కూడిన 42 మంది సభ్యులు గ్రూప్‌.. క్లీన్ మౌంటైన్ హౌస్ ప్రచారంలో పాల్గొని విజయవంతం చేశాయి.

 

రోటరీ క్లబ్ ఆఫ్ మౌంటైన్ హౌస్ ప్రెసిడెంట్  సియెరా ఎడ్వర్డ్ , మౌంటైన్ హౌస్ మ్యాటర్స్ మ్యాగజైన్ యజమాని, సంపాదకుడు బ్రయాన్ హారిసన్ ఈ కార్యక్రమానికి హాజరై వాలంటీర్లను ప్రోత్సహించారు. అదేవిధంగా మౌంటైన్ హౌస్ హ్యారీ ధిల్లాన్.. వాలంటీర్లకు మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతంగా  నిర్వహించడానికి అవసరమైన అన్ని సదుపాయాలు, పరికరాలను ఆయన అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement