● ప్రత్యేక బస్సులతో
రూ.1.95 కోట్ల ఆదాయం
నిజామాబాద్ రూరల్: టీజీఎస్ ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్‌లో దసరా జోష్ నెలకొంది. పండుగ సందర్భంగా నడిపిన ప్రత్యేక బస్సు సర్వీసులతో రూ.1.95 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆర్‌ఎం ఎస్‌వీజీ కృష్ణమూర్తి శుక్రవారం వెల్లడించారు. విజయదశమి సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం నిజామాబాద్ రీజియన్ పరిధిలో ఈ నెల 9 నుంచి 26 వరకు ప్రత్యేక బస్సు సర్వీసులను సమర్థవంతంగా నిర్వహించామని తెలిపారు. ఆర్మూర్, బాన్సువాడ, బోధన్, కామారెడ్డి, నిజామాబాద్–1, 2 డిపోల నుంచి 788 బస్సులను నడిపి 1,14,207 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్లు తెలిపారు. దసరా పండుగ ప్రత్యేక ఆపరేషన్ విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన డిపో మేనేజర్లు, అధికారులు, డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.


