పశువైద్య కేంద్రాలకు పవర్‌ కష్టాలు! | - | Sakshi
Sakshi News home page

పశువైద్య కేంద్రాలకు పవర్‌ కష్టాలు!

Oct 31 2026 8:07 AM | Updated on Oct 31 2026 8:07 AM

వ్యాక్సిన్లు, మందులకు ముప్పు బిల్లులు పాస్‌ కావడం లేదు

36

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌) : జిల్లా పశుసంవర్ధక శాఖ ప రిస్థితి అత్యంత దయనీయంగా మారింది. కనీసం విద్యుత్‌ బిల్లులు కూడా కట్టలేని దుస్థితికి చేరింది. రెండేళ్లుగా ప్రభుత్వం నుంచి విద్యుత్‌ బిల్లులకు సంబంధించిన నిధులు విడుదల కాకపోవడంతో గ్రా మాలు, మండల కేంద్రాల్లోని పశువైద్య కేంద్రాల ప రిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. బకాయిలు చెల్లించకపోతే విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామంటూ విద్యుత్‌ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు నోటీసులు జారీ చేస్తుండగా, తాజాగా మరోసారి నోటీ సులు ఇవ్వడంతో పశువైద్యాధికారులు లబోదిబోమంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏరియా ఆస్పత్రు లు, ప్రైమరీ వెటర్నరీ ఆస్పత్రులు, సబ్‌ సెంటర్లు కలిపి 83 ఉన్నాయి. వీటికి సంబంధించిన విద్యుత్‌ బకాయిలు సుమారు రూ.20 లక్షల వరకు పేరుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు. బకాయిల చెల్లింపుల కోసం ప్రభుత్వానికి బిల్లులు పెట్టినప్పటికీ అవి పాస్‌ కావడం లేదు. ఒక్కో పశువైద్య కేంద్రానికి రూ.10 వేల నుంచి రూ.35 వేల వరకు బకాయిలున్నట్లు తెలుస్తోంది.

పశువైద్య కేంద్రాల్లో మూగజీవాలకు వేసే అత్యవస ర వ్యాక్సిన్లు, ఖరీదైన మందులను ఎల్లప్పుడూ రిఫ్రిజిరేటర్లలో ఉంచి నిర్దేశిత ఉష్ణోగ్రతల్లో భద్రపరచా ల్సి ఉంటుంది. ఇప్పుడు విద్యుత్‌ కనెక్షన్‌ తొలగిస్తే ఆ ఫ్రిజ్‌లన్నీ ఆగిపోయి వ్యాక్సిన్లు, మందులు పూర్తి గా పాడైపోయే ప్రమాదం పొంచి ఉంది. విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తే గ్రామాల్లో మూగజీవాలకు సకాలంలో వైద్యం అందక ఇబ్బందులు ఎదురవుతాయని, బకాయిలు చెల్లించడానికి కాస్త సమయం ఇవ్వాలంటూ పశువైద్యాధికారులు ట్రాన్స్‌కో అధికారులను ప్రాథేయపడున్నారు.

మండలాలు, గ్రామాల్లోని పశువైద్య కేంద్రాలకు వి ద్యుత్‌ బకాయిలు పేరుకుపోయాయి. వీటిని చెల్లించడానికి బిల్లులు పాస్‌ కావడం లేదు. కేంద్రాలకు కరెంట్‌ సరఫరా నిలిపివేస్తే ఇబ్బందిగా మారుతుంది. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారించాలని కోరాం. – గంగాధరయ్య,

జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి

జిల్లా వ్యాప్తంగా రూ.20 లక్షల వరకు

పేరుకుపోయిన విద్యుత్‌ బకాయిలు

బిల్లులు కూడా కట్టలేని దుస్థితిలో

పశుసంవర్ధక శాఖ

కనెక్షన్‌ తొలగిస్తామని

విద్యుత్‌ శాఖ నోటీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement