సమీకృత పంటల సాగు భేష్‌ | - | Sakshi
Sakshi News home page

సమీకృత పంటల సాగు భేష్‌

Oct 31 2026 8:07 AM | Updated on Oct 31 2026 8:07 AM

● కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

● ఆర్మీ విశ్రాంత సుబేదార్‌ మేజర్‌

సిరివేణి నవీన్‌ వ్యవసాయక్షేత్ర సందర్శన

బోధన్‌ : వాతావరణ మార్పుల నేపథ్యంలో వరికి బదులు సమీకృత విధానంలో వైవిధ్యమైన పంటల సాగుపై దృష్టిసారించాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి రైతులకు సూచించారు. నీటిని పొదుపుగా వినియోగించుకొని సేంద్రియ వ్యవసాయం, ఆరుతడి పంటలు సాగు చేస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. శుక్రవారం ఎడపల్లి మండలంలోని వడ్డెపల్లి గ్రామశివారులో ఆర్మీ విశ్రాంత సుబేదార్‌ మేజర్‌, ఆదర్శ రైతు సిరివేణి నవీన్‌కు చెందిన జై జవాన్‌ ఆగ్రో ఫార్మింగ్‌ వ్యవసాయ క్షేత్రాన్ని కలెక్టర్‌, బోధన్‌ ఆర్డీవో విజయకుమారి, అధికారులతో కలిసి సందర్శించారు. వ్యవసాయ క్షేత్రంలో సాగు చేసిన వివిధ రకాల పంటలు, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పరిశీలించారు. వినూత్న ప్రయోగాలతో సాంకేతికతను సమన్వయం చేసుకొని పంటల సాగుకు అవలంబిస్తున్న పద్ధతులు, తన అనుభవాలను రైతు నవీన్‌ కలెక్టర్‌కు వివరించారు. సేంద్రియ విధానంలో పండించిన పంటలు, వివిధ ఉత్పత్తులను స్వయంగా తయారు చేసి ఆన్‌లైన్‌ వేదికల ద్వారా విక్రయాలు చేపడుతున్న విధానాన్ని కలెక్టర్‌ ఆసక్తిగా తెలుసుకున్నారు. వ్యవసాయంతోపాటు పాడి పశువుల పెంపకం, వాటి పేడ, మూత్రంతో జీవామృతం, కషాయం తయారు చేసి పంటలకు వినియోగిస్తున్న తీరు, వాటర్‌ హార్వెస్టింగ్‌ నిర్మాణాల ఏర్పాట్లను కలెక్టర్‌ పరిశీలించారు. కలెక్టర్‌ వెంట జిల్లా వ్యవసాయ శా ఖ అధికారి వీరాస్వామి, బోధన్‌ ఆర్డీవో విజయకుమారి, తహసీల్దార్‌ దత్తాద్రి, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement