ప్రసూతి వైద్యసేవలను బలోపేతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రసూతి వైద్యసేవలను బలోపేతం చేయాలి

Oct 31 2026 8:07 AM | Updated on Oct 31 2026 8:07 AM

● డీఎంహెచ్‌వో రాజశ్రీ

నిజామాబాద్‌ అర్బన్‌: అత్యవసర ప్రసూతి వైద్య సేవలను బలోపేతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజశ్రీ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్యాఆరోగ్యశాఖ కార్యాలయంలో శుక్రవారం మాతృ మరణాలపై సమీక్ష సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ మాతృ మరణాల నివారణకు సంబంధిత వైద్యాధికారులు ప్రయివేటు ఆస్ప త్రుల వైద్య నిపుణులు, క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని పే ర్కొన్నారు. మాతృ మరణానికి సంబంధించిన వైద్య రికార్డులను, కేసుల వివరాలను సమీక్షించారు. ఇప్పటి వరకు జరిగిన మాతృ మరణాలకు గల కారణాలు, గర్భిణుల ఏ ఎంసీ పరీక్షలు, హైరిస్క్‌ గర్భిణుల గుర్తింపు నిరంతర పర్యవేక్షణపై చర్చించారు. ప్రసవ సమయంలో, ప్రసవానంతరం అందించిన వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. స మావేశంలో అదనపు జిల్లా వైద్యాధికారి సి కిందర్‌, పాన్‌గల్లి, పెగడపల్లి, సిరికొండ ఆ రోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ఆరోగ్య సి బ్బంది పాల్గొన్నారు.

రేపు ఓపెన్‌ డిగ్రీ

తరగతులు ప్రారంభం

ఖలీల్‌వాడి : డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్‌ తరగతులు ఆదివారం ఉదయం 11 గంటల కు ప్రారంభమవుతాయని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రాంమోహన్‌రెడ్డి, కోఆర్డినేటర్‌ డాక్టర్‌ రంజి త శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. త రగతులకు విద్యార్థులు కచ్చితంగా హాజరుకావాలని, వివరాలకు 73829 29612 సంప్రదించాలని సూచించారు.

ఫేస్‌ రికగ్నిషన్‌

హాజరు తప్పనిసరి

వర్ని/రుద్రూర్‌: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులతోపాటు అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది తప్పనిసరిగా ఫేస్‌ రికగ్నిషన్‌ విధానంలో హాజరు నమోదు చేసుకోవాలని డీఐఈవో టి.రవికుమార్‌ స్పష్టం చేశారు. శుక్రవారం వర్ని, కోటగిరి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు, బోధనేతర సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. ప్రతి విద్యార్థి హాజరును ఉదయం 10.30 గంటల లోపు ఫేస్‌ రికగ్నిషన్‌ ద్వారా నమోదు చేయడం అధ్యాపకుల బాధ్యత అని పేర్కొన్నారు. అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది విధులకు సకాలంలో హాజరుకావాలన్నారు. నవంబర్‌ నెలలోగా సిలబస్‌ పూర్తి చేయడంతోపాటు ప్రాక్టికల్స్‌కు సిద్ధం కావాలన్నారు. ప్రతి విద్యార్థి పరీక్ష ఫీజు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశాల్లో ప్రిన్సిపాళ్లు కల్పనాకుమారి, కౌసర్‌ పాషా, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

రైస్‌మిల్లర్లను

విచారించిన సీఐడీ

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లా కేంద్రంలోని నలుగురు రైస్‌మిల్లర్లను సీఐడీ అధికారులు శుక్రవారం విచారించారు. ఇటీవల సన్నబియ్యానికి బదులుగా దొడ్డు బియ్యం సరఫరా చేశారనే కేసులో సీఐడీ అధికారులు కేసు నమోదు చేసి నలుగురిని రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం వారిని కస్టడీకి తీసుకొని విచారించారు. సీఐడీ డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ కొనసాగింది. విచారణ సమయంలో పలువురు రైస్‌మిల్లర్ల యజమానులు తరలివచ్చారు. దీంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement