ఆర్మీలో దేశానికి సేవలందించి ఉద్యోగ విరమణ అనంతరం వ్యవసాయ రంగంలో అడుగుపెట్టి ఆధునిక సాంకేతికత, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను సమన్వయం చేసుకొని వైవిధ్యమైన పంటలను సాగు చేస్తున్న రైతు నవీన్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ రైతులకు సూచించారు. నవీన్‌తోపాటు ఆయన మాతృమూర్తి పుష్పను కలెక్టర్ అభినందించారు. అనంతరం రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. తక్కువ నీటితో దిగుబడులు చేతికొచ్చే ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా శనగ, మినుము, ఇతర పప్పు దినుసు పంటల సాగుకు అవసరమైన విత్తనాలను రాయితీపై అందిస్తున్నట్లు పేర్కొన్నారు.


