భర్త మరణిస్తే భార్యకు వెంటనే పింఛన్‌ | - | Sakshi
Sakshi News home page

భర్త మరణిస్తే భార్యకు వెంటనే పింఛన్‌

Nov 1 2026 7:31 AM | Updated on Nov 1 2026 7:31 AM

● కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

ఆర్మూర్‌: భర్త మరణించిన సందర్భంలో భార్యకు వెంటనే పింఛన్‌ మంజూరు చేయాలని సామాజిక భద్రత శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవోను జారీ చేసింది. ఇంతకు ముందు వృద్ధాప్య పింఛన్‌కు మాత్రమే వర్తించే ఈ నిబంధనను ప్రస్తుతం అన్ని రకాల పింఛన్‌లకు వర్తింపజేయనున్నారు. సవరించిన నిబంధన ప్రకా రం దివ్యాంగుల, గీత, చేనేత కార్మికుల, డయాలసిస్‌, ఏఆర్‌టీ (హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌), పైలేరియా పింఛన్‌లు పొందుతున్న లబ్ధిదారుడు మరణిస్తే భార్యకు వెంటనే పింఛన్‌ మంజూరుకానుంది. మృతుడి ఆధార్‌, మరణ ధ్రువీకరణపత్రం, భార్య ఆ ధార్‌ కార్డు, బ్యాంక్‌ పాస్‌ బుక్‌ జిరాక్స్‌తో దరఖా స్తు చేసుకోవాల్సి ఉంటుంది. గ్రామీణ గ్రామ పంచా యతీ కార్యదర్శికి, పట్టణల్లో మున్సిపల్‌ కార్యా లయ అధికారికి దరఖాస్తు అందజేయాలి. సంబంధిత అధికారులు పత్రాలను పరిశీలించి, దరఖాస్తును ఎంపీడీవో, మున్సిపల్‌ కమిషనర్‌కు ఫార్వర్డ్‌ చేస్తారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ప్రత్యేకంగా దరఖాస్తు గడువు ఉండదని సామా జిక భద్రత శాఖ స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement