వల్లభ్‌భాయ్‌ పటేల్‌కు నివాళి | - | Sakshi
Sakshi News home page

వల్లభ్‌భాయ్‌ పటేల్‌కు నివాళి

Nov 1 2026 7:31 AM | Updated on Nov 1 2026 7:31 AM

నిజామాబాద్‌ అర్బన్‌: సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం రాష్ట్రీయ ఏక్తా దివస్‌ను ఘనంగా నిర్వహించారు. ఎంపీ ధర్మపురి అర్వింద్‌, అ ర్బన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యేలు ధన్‌పాల్‌ సూర్యనారాయణ, పైడి రాకేశ్‌రెడ్డి, కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, నగర మేయర్‌ కే ఉమారాణి, జాతీ య పసుపు బోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డి, అదనపు కలెక్టర్లు రాజాగౌడ్‌, భుజంగరావు తదితరులు పటేల్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అధికారులు సిబ్బందితో డీఆర్‌వో గీత ప్రతి జ్ఞ చేయించారు. దేశ ఐకమత్యం, సమగ్రత, భద్రతను కాపాడడానికి అంకితభావంతో కృషి చేస్తామని, తోటి వారందరిలో ఈ భావనను పెంపొందించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామని, సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటే ల్‌ దార్శనికతతో దేశానికి సమకూరిన అంతర్గత భద్రతను పటిష్టపరిచేందుకు తోడ్పాటును అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

పీజీ కోర్సుల్లో స్పాట్‌ అడ్మిషన్లు

ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని గిరిరాజ్‌ ప్ర భుత్వ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి వివిధ పీజీ కోర్సుల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ పి. రామ్మోహన్‌ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెస్సీ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, ఫిజి క్స్‌, ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్‌, ఎమ్మెస్సీ బాట నీ, జువాలజీ, బయోటెక్నాలజీ, డేటా సైన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎంఏ ఇంగ్లిష్‌, ఎకానామి క్స్‌, బీఎల్‌ఐఎస్సీ సీట్లు ఉన్నాయని పే ర్కొ న్నారు. టీజీసీపీగేట్‌–2026 ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులతోపాటు, అర్హత సాధించని వారు కూడా స్పాట్‌ అడ్మిషన్ల కో సం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నవంబర్‌ 3 నుంచి 6వ తేదీలోగా ఒరిజనల్‌ ధ్రువపత్రాలతోపాటు రెండు సెట్ల జిరాక్స్‌ ప్రతులు, రెండు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలతో కళాశాలలో సంప్రదించాలని పేర్కొన్నారు.

సేవలో ప్రతిఒక్కరూ

భాగస్వాములు కావాలి

నిజామాబాద్‌ రూరల్‌: మానవత్వంతో చేప ట్టే సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భా గ స్వాములు కావాలని సీపీ సాయిచైతన్య అన్నారు. ఇందూరు యువత స్వచ్ఛంద సే వాసంస్థ ఆధ్వర్యంలో ఈనెల 1 నుంచి డిసెంబర్‌ 30వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ‘పునర్జన్మ’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. కమిషనరేట్‌ కార్యాలయంలో సీపీ శనివారం వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్లపై దీనస్థితిలో జీవిస్తున్న అనాథ వృద్ధులు, మతిస్థిమితం కోల్పోయిన అభాగ్యులు ఎక్కడైనా కనిపిస్తే ఇందూరు యువత స్వచ్ఛంద సేవాసంస్థకు సమాచారం అందించాలని కోరా రు. నిరాదరణకు గురైన వారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, ఇలాంటి మానవీయ సేవా కార్యక్రమాలకు పోలీస్‌ శాఖ ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందన్నారు. స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ మద్దుకూరి సాయిబాబు, ఈసీ సభ్యుడు మద్ది గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement